మంచి ఉద్యోగం వదిలేసి పూజారిగా మారింది..! అది కూడా వేరే మతం నుండి..?

Ads

హిందూ ఆలయాలలో పూజారులుగా పురుషులు ఉంటారనే విషయం తెలిసిందే. బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు. భక్తులకు గుడిలోకి వెళ్లి పూజచేసే ఛాన్స్ ఉండదు. అయితే ఒక గుడిలో ఒక స్త్రీ పూజారిగా కొనసాగుతుంది.

Ads

అందులోనూ ఆమె భారత్ కు చెందిన మహిళ కాదు. హిందువు కూడా కాదు. అయినప్పటికీ అమ్మవారి సన్నిధిలో తరిస్తోంది. తన దేశాన్ని, మతాన్ని, ఇంటిని విడిచిపెట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ఎవరో? ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందో ఇప్పుడు చూద్దాం..
కోయంబత్తూరులోని ఈశాయోగా కేంద్రంలో ఉన్న మా లింగ భైరవి దేవాలయనికి వచ్చే వారికి ఎరుపు రంగు చీర ధరించి, చిరునవ్వుతో స్వాగతం పలికే పూజరినే భైరాగిణి మా హనీనే. చూడగానే ఆమె విదేశీ మహిళ అనే విషయం తెలిసిపోతుంది. భైరాగిణి మా హనీన్ లెబనాన్‌లో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసేవారు. ఆమె ఆధ్యాత్మికత మార్గంలో నడవడానికి, అంతర్గత పరిపూర్ణత పొందడం కోసం తన లగ్జరీ లైఫ్ ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న సమయంలో హనీనే వయసు 25 ఏళ్లు మాత్రమే.
ఆమె తన ఆధ్యాత్మికత జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చారు. “లెబనాన్ దేశం నుండి వచ్చాను. గ్రాఫిక్ డిజైనింగ్ చదివాను. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌ గా పనిచేశాను. 2009లో ఫుల్ టైమ్ వాలంటీర్‌గా భారత్ కి వచ్చాను. 14 ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాను. కానీ నిన్ననో, మొన్ననో జరిగినట్టుగానే అనిపిస్తుంది. నాకు ఆధ్యాత్మికత, యోగా లాంటివి ఏమీ తెలియవు. దురదృష్టవశాత్తు నా ఫ్రెండ్ చనిపోవడం తీవ్రంగా కలచివేసింది. అప్పుడే నా మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి.
వాటికి జవాబులు వెతకడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో సద్గురువు గురించి తెలిసింది. 2005లో ఈశా యోగా కేంద్రం అందించే ప్రోగ్రామ్ ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ చేశాను. ఆ తర్వాత లెబనాన్ కి వెళ్లి జాబ్ కి రాజీనామా చేసి, ఇక్కడికి వచ్చేశాను. అప్పటి నుండి ప్రతి అంశంలో స్వచ్ఛందంగా పనిచేయడం మొదలుపెట్టాను. ఇది గతంలో ఎప్పుడు లేని సంతృప్తిని ఇచ్చింది”.
భైరాగిణి మా అనేది లింగ భైరవి దేవి పూజరులకు సంబంధించిన పదం. భైరాగిణి మాలు లింగ భైరవి ఆలయానికి సంరక్షకులు. వారు పూజలు చేయడం నుంచి హారతి వరకు అన్ని హిందూ ఆచారాలను నిర్వహిస్తారు. వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చిన ఒక స్త్రీ ఇంత భక్తితో ఇవన్నీ చేయడం అక్కడికి వచ్చే భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Also Read:
బ్రాహ్మణుల్లో చాలా మంది ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు తినరు..? కారణం ఏమిటంటే..?

Previous articleఇలాంటి మగవాళ్లకి ఎలా బుద్ది చెప్పాలి.? అంత వయసు వచ్చి కూడా.!
Next articleకొడుకు సక్సెస్ కోసం “బుమ్రా” తల్లి ఇంత త్యాగం చేశారా..? ఈమె గురించి తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.