Ads
సాధారణంగా సినిమాలు అంటేనే మన దేశ ప్రజలకు అదోరకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద హీరోల సినిమాలు అంటే రోజుకి ఏదో ఒక రకమైన న్యూస్ వస్తూనే ఉంటుంది. ఈ న్యూస్ లో కొన్ని నిజం ఉంటే చాలా వరకు అబద్ధాలే ఉంటాయి.
సినిమా స్టోరీ ఇది అని, ఇందులో హీరో రోల్ ఇలా ఉంటుంది అని ఇలా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ వార్తలు రావడం చాలా ఎక్కువ అయిపోయాయి. అందులోనూ మరి ఈ సినిమాలో ఈ హీరో ఒక కేమియో చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
దాంతో చాలా అంచనాలు పెట్టుకొని థియేటర్లలోకి ఆ హీరో కోసం వెళ్ళిన ప్రేక్షకులకి నిరాశ ఎదురవుతుంది. అలా ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో ఈ హీరో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. అలాంటి సినిమాలు ఏవో, అలా ఆ సినిమాలో ఉన్నారు అని అనుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 రామ్ చరణ్ – లియో
ఇటీవల గట్టిగా ప్రచారం జరిగిన వార్త ఇదే. విజయ్ వెనుక నుండి తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి ఇది రామ్ చరణ్ అంటూ ప్రచారం చేశారు. అంతే కాకుండా సంజయ్ దత్ కి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో “ఆంటోనీ” అని ఒక వ్యక్తి పిలుస్తారు. అలా పిలిచిన వ్యక్తి రామ్ చరణ్ అని, ఆ గొంతు రామ్ చరణ్ దే అని ఎంతో కాన్ఫిడెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కానీ తీరా చూస్తే అది యాక్షన్ కింగ్ అర్జున్ గొంతు. అప్పటికే సినిమా మొత్తంలో చాలా మంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. సినిమాకి పబ్లిసిటీ చాలానే వచ్చేసింది. అసలు రామ్ చరణ్ ఉన్నారు అనే వార్త ఎలా వచ్చిందో, అసలు రామ్ చరణ్ ఉన్నారు అంటే జనాలు ఎలా నమ్మారో ఎవరికీ అర్థం కాదు.
#2 జూనియర్ ఎన్టీఆర్ – టైగర్ 3
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టైగర్ సినిమాకి కనెక్షన్ ఉంది. అయితే సినిమా చివరిలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు అని వార్త బయటికి వచ్చింది. కానీ ఈ వార్త విని నిజం అనుకొని నమ్మి థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. సినిమా చివరిలో హృతిక్ రోషన్ కనిపిస్తారు అంతే. హృతిక్ రోషన్ కి ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు. మరి ఇది జూనియర్ ఎన్టీఆర్ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది కూడా తెలియదు.
Ads
#3 ప్రభాస్ – RRR
అవును. మీరు విన్నది నిజమే. సినిమా వాయిదా పడే సమయంలో ఈ సినిమా గురించి ఎన్ని వార్తలు వచ్చాయో లెక్కే లేదు. అందులో ఇది ఒకటి. బాహుబలి ప్రభాస్ ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు అని అన్నారు. కానీ వార్త వార్త గానే మిగిలిపోయింది.
#4 సూర్య – లియో
లియోలో శాండీ మాస్టర్ పోషించిన పాత్ర, విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకి చిన్నప్పటి పాత్ర అని, సినిమా చివరిలో రోలెక్స్ పెద్దగా అయ్యి సూర్య కూడా కనిపిస్తారు అని అన్నారు.
#5 మహేష్ బాబు – ఆచార్య
ఆచార్య సినిమాలో మహేష్ బాబు ఒక రోల్ చేస్తున్నారు అంటూ వార్త వచ్చింది. తర్వాత సినిమా కథ మారింది అని కూడా అన్నారు. అయితే చివరికి ప్రేక్షకులని మరీ నిరాశ పరచకుండా ఈ వార్త సగం వరకు నిజమే అయ్యింది. ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#6 విజయ్ – జవాన్
తమిళ్ హీరో విజయ్ జవాన్ సినిమాలో ఒక పాత్ర చేశారు అన్నారు. కానీ చివరి నిమిషంలో విజయ్ చేయాల్సిన పాత్రని సంజయ్ దత్ చేసినట్టు సమాచారం.
#7 నాని – జైలర్
నాని కూడా జైలర్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు అని, ప్రేక్షకులని ఇది సర్ప్రైజ్ చేస్తుంది అని అన్నారు. కానీ ఈ సినిమాలో నాని ఎక్కడా కనిపించలేదు.
#8 అల్లు అర్జున్ – జవాన్
ముందు విజయ్ చేయాల్సిన పాత్ర తర్వాత అల్లు అర్జున్ చేతికి వెళ్ళింది అని, అల్లు అర్జున్ తన పాత్రకి సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది.
ఇవి మాత్రమే కాదు. ఇంకా చాలా సినిమాల్లో చాలా మంది హీరోలు కనిపిస్తారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యి, థియేటర్లలోకి వెళ్ళాక జనాలని మోసం చేశాయి.
ALSO READ : ఈ గొడవలోకి చిరంజీవిని ఎందుకు లాగారు..? అసలు చిరంజీవి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..?