Ads
వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోతోంది. రాజస్థాన్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఈ వేడుక జరుగుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి. కొంత కాలం క్రితం రాజారెడ్డి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యి రాజారెడ్డిని, అతనికి కాబోయే భార్య ప్రియా అట్లూరిని ఆశీర్వదించారు. ఈ వేడుకకి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు అయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లికి మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యే అవకాశాలు లేనట్టు సమాచారం.
వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భార్య భారతీ రెడ్డి కూడా ఈ వేడుకకి హాజరు అవ్వలేరు అనే వార్త వినిపిస్తోంది. ఇందుకు కారణం ఏంటి అనేది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వృత్తిపరంగా కొన్ని పనులు ఉన్నాయి అని, ఈ కారణంగానే హాజరు అవ్వలేరు అని అంటున్నారు. ఎంగేజ్మెంట్ కి మాత్రం విజయవాడ నుండి జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యారు. అయితే పెళ్లికి వచ్చే అవకాశాలు లేకపోయినా కూడా రిసెప్షన్ కి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు.
Ads
అయితే షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాజారెడ్డి పెళ్లి కూడా అలాగే జరుగుతోంది. పెళ్లికి ముందు మెహందీ, సంగీత్ వంటి వేడుకలు కూడా అయ్యాయి. 16వ తేదీ సంగీత్, మెహందీ కార్యక్రమాలు అయ్యాయి. 17వ తేదీ 5 గంటల 30 నిమిషాలకి పెళ్లి. 18వ తేదీ ఉదయం 11 గంటలకి నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత, అదే రోజు సాయంత్రం 7 గంటలకి తలంబ్రాలు వేడుక జరుగుతుంది.
ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి హాజరు కావాలి అని షర్మిల ఆహ్వానాలు అందించారు. చంద్రబాబు పవన్, కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరు అవుతారు అని అంటున్నారు. వీరు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం నుండి కూడా మరొకరు వెళ్తారు అని అంటున్నారు. అంతే కాకుండా సినీ రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ : తిరుపతి జూ పార్క్‌లో మరణించిన వ్యక్తి ఎవరు..? అసలు అతను సింహాల ఎన్‌క్లోజర్ లోకి ఎందుకు దూకాడు..?