Ads
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా మాధ్యమంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చింది. అయితే, బుధవారం రాత్రి విజయవాడలో ఉన్న ఆంధ్రరత్న భవన్ లో షర్మిల నిద్రించారు.
అక్కడ గురువారం ఉదయం రోజు పోలీసులు బ్యారికెట్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలని గృహ నిర్బంధంతో పాటు, ముందస్తు అరెస్టులు జారీ చేశారు. ఈ విషయం మీద షర్మిల తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.
ట్విట్టర్ లో షర్మిల ఈ విధంగా రాశారు. “నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే… మాకు భయపడుతున్నట్లే కదా అర్థం.”
Ads
“మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు.మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు.మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.”
“ఇందుకు మీ చర్యలే నిదర్శనం.CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి” అని షర్మిల రాశారు. దీంతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేశారు. నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి అంటూ షర్మిల తన పోస్ట్ ద్వారా తీవ్ర నిరసనని వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ…
— YS Sharmila (@realyssharmila) February 21, 2024
ALSO READ : ప్రేయసి కోసం కోట్ల జీతం వదిలి కలెక్టర్ అయ్యి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?