Ads
సాధారణంగా విదేశాలకు వెళ్లాలి అంటే ఎవరికైనా సరే వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల ఇండియా అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్స్ లిస్ట్ లో 85వ ప్లేస్ ను పొందింది. దాంతో భారతీయులు 59 దేశాల వరకు వీసా లేకుండానే ప్రయాణం చేయవచ్చు.
Ads
ఇక ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నట్లయితే వీసా కానీ, వీసా ఆన్ అరైవల్ కూడా అవసరం లేకుండా ఈ పది దేశాలకు వెళ్ళవచ్చు. దానివల్ల అక్కడికి వెళ్లేందుకు ఎక్కువగా ప్లాన్ చేసుకోవచ్చు. సులభంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ దేశాలకు విహార యాత్రలు చేయొచ్చు. మరి ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.బార్బడోస్:
కరేబియన్ దేశాలలో అత్యంత అందంగా ఉండేవాటిలో బార్బడోస్ ఒకటి. ద్వీపంలో ఉండాలనుకునే వారికి అయితే నచ్చుతుంది. ఇక్కడికి వీసా లేకుండా వెళ్లొచ్చు.
2.భూటాన్:
రెండవ దేశం భూటాన్. తక్కువ బడ్జెట్‌లోనే విదేశాలు చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్, ఎందుకంటేభూటాన్ ఇండియాకి పొరుగు దేశం అంటే పక్కనే ఉంటుంది.
3.ఫిజీ:
ఈ లిస్ట్ లో మూడవ దేశం ఫిజీ. భారతీయులు వీసా లేకుండా ఈ దేశంలో 120 రోజుల పాటు ఇక్కడ ఉండవచ్చు. బీచ్‌లు, టాప్ స్పాలు, చాలా టేస్టీ ఫుడ్ అంతేకాకుండా సాహస క్రీడలకు ఫిజీ ప్రసిద్ధి చెందింది.
4.జమైకా:
నాలుగవ దేశం జమైకా. ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. జమైకాకు వెళ్ళడానికి మరియు ఇక్కడ 30 రోజుల పాటు ఉండడానికి ఇండియన్స్ కి వీసా అవసరం లేదు.
5.కజకిస్తాన్
ఈ జాబితాలో ఐదవ దేశం కజకిస్తాన్. తమ లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం.
6.మారిషస్:
ఈ జాబితాలో 6వ దేశం మారిషస్. వీసా లేకుండా ఇక్కడికి వెళ్లాడమే కాకుండా 90 రోజుల వరకు ఉండవచ్చు. ఇండియన్స్ కి స్నేహపూర్వక దేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఇండియన్స్ చాలా గౌరవిస్తారు.
7.నేపాల్:
ఏడవ దేశం నేపాల్. ఈ దేశం వెళ్ళాలి అంటే భారత ప్రభుత్వం జారీ చేసిన ఎన్నికల కార్డు కానీ, ఫోటో ID కార్డ్ ఉంటే సరిపోతుంది.
8.సెయింట్ కిట్స్ మరియు నెవిస్:
ఆ తరువాత దేశం ‘సెయింట్ కిట్స్ మరియు నెవిస్. ఇది అందమైన బీచ్‌లకు నిలయం.
9.సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్:
ఈ దేశంలో వీసా లేకుండా 30 రోజుల పాటు ఉండవచ్చు. సముద్ర జలాల్లో విహరించాలనుకునే వారికి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.
10.ట్రినిడాడ్ అండ్ టొబాగో
ద్వీప దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటన అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. భారతీయులకు 90 రోజుల పాటు ఉండవచ్చు.
Also Read: అక్కడ జనవరి 29న రిపబ్లిక్ డే.. ఎందుకు అలా జరుపుకుంటున్నారో తెలుసా?