రోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

Ads

సీనియర్ హీరోయిన్ రోజా అందరికీ పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలు సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అక్కడ తన ఉనికి చాటుకుంటూనే బుల్లితెరలో వచ్చే జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా వ్యవహరించారు. ఏ రంగంలో ఉన్న నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటు వచ్చారు.

అయితే రోజా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమణి నీ లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది? మొదటి ఎక్కడ పరిచయం అయ్యారు అనే పూర్తి డిటేల్స్ మీకోసం….

మొదటిసారి రోజా తన భర్త సెల్వమణిని సినిమా ఆఫీసులో కలిశారట. అప్పుడు ఆయన తమిళంలో చామంతి సినిమాని తీసే ప్రయత్నంలో ఉన్నారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ రోజా ఫోటో చూసి ఆయనకు చెప్పగా ఆఫీస్ కి పిలిపించమని చెప్తే రోజా తన తండ్రితో కలిసి రోజా సెల్వమణి ఆఫీస్ కి వెళ్లారు. అక్కడే ఆయనను మొదటిసారి చూడడం. తర్వాత రోజు రమ్మని చెప్పి రోజాకి మేకప్ టెస్ట్, కాస్ట్యూమ్ టెస్ట్ చేశారంట.

Ads

roja selvamani love story 1

 

అలా ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడడం జరిగింది. కాకపోతే ఎక్కువ మాట్లాడుకునేవారు కాదట. ఒకసారి రోజా సెల్వమణికి వెంకటేశ్వర స్వామి ఫోటో గిఫ్ట్ ఇవ్వగా అప్పుడు ఆయనకి రోజా మీద మంచి అభిప్రాయం వచ్చిందట. రోజా తనమీద ప్రేమతో ఇచ్చిందేమో అనుకున్నారాట. అయితే ఎవరు ఎవరికి ప్రపోజ్ చేసుకోలేదు.సెల్వమణి నేరుగా వెళ్లి రోజా ఇంట్లో పెళ్లి చేసుకుంటాను అని అడగడం వాళ్ళు ఒప్పుకోవడం అలా వారి వివాహం జరగడం అయింది.ఇద్దరి దంపతులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. ప్రస్తుతం రోజా ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

Previous articleనాని సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
Next article“స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.