హిందూ సంస్కృతిని పాటిస్తున్న 8 మంది విదేశీ క్రికెటర్లు..! లిస్ట్ లో ఆ దేశం వాళ్ళే ఎక్కువ.!

Ads

హిందూ సంస్కృతి ప్రపంచంలోని పురాతనమైన సంస్కృతులలో ఒకటి. 5 వేల ఏళ్ళకు పైగా చరిత్రను కలిగి ఉంది. ఇండియాలోని వారే కాకుండా విదేశాల నుండి వచ్చిన వారు కూడా హిందూ సంస్కృతి పై ఆసక్తిని చూపిస్తుంటారు.

హిందూ సంస్కృతి పై ఆసక్తి చూపించేవారిలో క్రికెటర్లు కూడా ఉన్నారు. భారతీయ క్రికెటర్లు మాత్రమే కాకుండా విదేశీ క్రికెటర్లలో కొందరు హిందూ సంస్కృతిని పాటిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..1. డానిష్ కనేరియా:

ఈ పాకిస్తానీ క్రికెటర్ పూర్తి పేరు డానిష్ పరభా శంకర్ కనేరియా. పాకిస్తాన్ జట్టు తరుపున 61 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కనేరియా 261 వికెట్లు తీశాడు. పాకిస్థానీ అయినప్పటికీ కనేరియాకి హిందూ సంస్కృతి పై ఆసక్తితో పాటిస్తున్నారు.
2. ముత్తయ్య మురళీధరన్: 

శ్రీలంక బౌలర్ మురళిధరన్ 1972లో ఏప్రిల్ 17న తమిళ హిందూ ఫ్యామిలీలో జన్మించారు. ముత్తయ్య మురళీధరన్ హిందూ సంస్కృతిని శ్రద్దగా పాటిస్తారు.
3. కేశవ్ ఆత్మానంద మహారాజ్: 

కేశవ్ ఆత్మానంద మహారాజ్ దక్షిణాఫ్రికా క్రికెటర్. 1990 లో ఫిబ్రవరి 7న జన్మించారు. మహరాజ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కేశవ్ హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు.
4. లిటన్ కుమేర్ దాస్:

లిటన్ కుమేర్ దాస్ బంగ్లాదేశ్ క్రికెటర్. 1994లో అక్టోబర్ 13న జన్మించారు. ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్‌లలో నేషనల్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రికెటర్ హిందూ సంస్కృతిని  పాటిస్తారు.
5. సమిత్ రోహిత్ పటేల్:

Ads

సమిత్ రోహిత్ పటేల్ ఇంగ్లాండ్ క్రికెటర్. సమిత్ 1984లో నవంబర్ 30న లీసెస్టర్‌లో జన్మించారు. అయితే సమిత్ తల్లిదండ్రులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జన్మించారు. అతను డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడతాడు. హిందూ అమ్మాయిని ప్రేమించిన సమిత్, హిందూ సంప్రదాయంలో పెళ్లిని చేసుకున్నారు.
6. సౌమ్య సర్కార్: 

సర్కార్ బంగ్లాదేశ్ క్రికెటర్. 1993లో ఫిబ్రవరి 25న సత్ఖిరాలో బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించారు. ఎక్కువగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ గా సర్కార్ ఆడతారు. హిందూ సంస్కృతిని పాటిస్తారు.
7. సునీల్ ఫిలిప్ నరైన్: 

సునీల్ ఫిలిప్ నరైన్ వెస్టిండీస్ తరుపున ఆడుతున్న ట్రినిడాడియన్ క్రికెటర్. సునీల్ 1988లో మే 26న జన్మించారు. ప్రధానంగా ఆఫ్ స్పిన్ బౌలర్, హిందూ సంస్కృతిని ఆచరిస్తారు.
8. శివ్ నరైన్ చందర్‌పాల్: 

శివ్ నరైన్ చందర్‌పాల్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ మరియు గయానీస్ క్రికెట్ కు కోచ్. అతని కాలంలో ఉన్న గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా చందర్‌పాల్ పరిగణించబడ్డాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పదవ బ్యాట్స్‌మెన్‌, టెస్ట్ క్రికెట్‌లో 8వ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ గా నిలిచారు. చందర్‌పాల్ 2004 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. చందర్‌పాల్ హిందూ సంస్కృతిని ఆచరిస్తారు.

Also Read: భారత్ తో మీకు పోలికా.? వెళ్లి పిల్ల కూనలపై ఆడుకోండి..!

Previous articleమీ అరచేతి మీద M సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!
Next articleమధ్యలోనే ఆగిపోయిన ‘పవన్ కళ్యాణ్’ 5 సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.