అర్జునుడు… కర్ణుడు… ఇద్దరిలో బలవంతుడు ఎవరు..? పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే..?

Ads

పురాణాల గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఇది సరైనది అని ఎవరు చెప్పలేరు. ఎవరికి ఉన్న అవగాహన వారిది. పురాణాలు బాగా చదివి, వాటిని అర్థం చేసుకొని దాని నుండి వచ్చే సమాధానాన్ని చెప్తూ ఉంటారు. అయితే గత కొంత కాలం నుండి ఒక ప్రశ్న మాత్రం అందరిలో నెలకొంది. ప్రశ్న ప్రశ్న లాగా ఉండకుండా ఈ విషయం మీద చర్చలు మొదలయ్యాయి. రోజుల నుండి ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

who is stronger between arjuna and karna

అర్జునుడు, కర్ణుడు. ఇద్దరిలో ఎవరు గొప్పవారు? ఎవరు బలవంతులు? ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు. కల్కి 2898 ఏడి సినిమా వచ్చిన తర్వాత నుండి ఈ ప్రశ్న నెలకొంది. సినిమాలో హీరోని కర్ణుడిగా చూపించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించారు. అయితే సాధారణంగా, అర్జునుడి గురించి కురుక్షేత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది కర్ణుడిగా హీరోని చూపించారు అంటే, ఈ సినిమాలో కర్ణుడిని గొప్పవారిగా చూపించాలి అని సినిమా బృందం అనుకున్నట్టు అర్థం అవుతోంది.

Ads

సాధారణంగా అయితే అర్జునుడు గొప్పవాడు. హీరోని అర్జునుడి లాగా చూపించాలి. కానీ కర్ణుడి లాగా ఎలా చూపించారు? కర్ణుడు కంటే కూడా అర్జునుడు కదా బలవంతుడు? అని అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. యూట్యూబ్ లో ఎంతో మంది ఈ విషయం మీద వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే పురాణాల ప్రకారం చూస్తే మాత్రం, అర్జునుడి కంటే కూడా కర్ణుడు బలశాలి అని తెలుస్తోంది. అర్జునుడికి, కర్ణుడికి వేరు వేరు బలాలు ఉన్నాయి. ఎవరి పోరాడే తీరు వారిది. కర్ణుడు ఎంతో గొప్ప యోధుడు.

విలువిద్యలో నేర్పరి. దాతృత్వ గుణానికి, విధేయత కర్ణుడికి చాలా ఎక్కువగా ఉంటాయి. మరొక పక్క, అర్జునుడు కూడా విలువిద్యలో నేర్పరి. ఎంత గొప్ప యోధుడు. అర్జునుడు ధైర్యం, తెలివితేటలకి, వ్యూహాత్మకంగా ఉండే ఆలోచనలకి పేరు పొందాడు. శరీర దారుఢ్యం అనే విషయం వస్తే మాత్రం కర్ణుడు అర్జునుడి కంటే కూడా ముందుంటాడు. ఈ విషయంలో బలవంతుడు కర్ణుడు. బలంపరంగా చూస్తే మాత్రం అర్జునుడి కంటే కూడా కర్ణుడు ఎక్కువ బలవంతుడిగా పరిగణిస్తారు. కానీ ఇద్దరినీ గొప్ప యోధులు అని అంటారు.

Previous articleలవ్ స్టోరీలకి ఫేమస్ అయిన ఈ నటుడు… విలన్ పాత్రలు కూడా చేస్తారా..? ఈ సినిమా చూశారా..?
Next articleబర్రెలక్క అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి..? అసలు ఏం జరిగింది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.