రాత్రిళ్ళు “పిక్కలు” పట్టేస్తున్నాయా…? అయితే మీలో ఈ మార్పు వచ్చిందని అర్ధం.!

Ads

చాలా మందికి రాత్రిళ్ళు నిద్ర లో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా నిద్రలో కాళ్లు పట్టేయడం కొంకర్లు పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీకు కూడా రాత్రిపూట మోకాళ్లు పెట్టేస్తూ ఉంటాయా..? లేదంటే నొప్పి పెడుతూ ఉంటాయా..? అయితే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి అసలు ఎందుకు పిక్కలు పట్టేస్తాయి..? ఎలా ఈ నొప్పి నుండి బయటపడాలి..? ఎటువంటి వ్యాయామ పద్ధతులు పాటిస్తే మంచిది అనే ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులు, కీళ్లు నొప్పులు వంటివి కలుగుతున్నాయి.

ఎందుకు పిక్కలు పట్టేస్తాయి..? కారణం ఏమిటి..?

#1. వ్యాయామం చేయడం వలన ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు అయితే ఎక్కువ సేపు చాలా మంది  ర్చుంటూ ఉంటారు. సరిగ్గా వ్యాయామం చేయకుండా ఎక్కువసేపు కూర్చోవడం వలన మోకాళ్ళ నొప్పులు పిక్కలు పట్టేయడం వంటివి రాత్రుళ్లు జరుగుతూ ఉంటాయి.
#2. ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వలన ఈ ఇబ్బంది వస్తుంది.
#3. శరీరంలో మెగ్నీషియం తగ్గడం వలన కూడా ఇలా జరుగుతుంది. ఏదైనా పోషకాహార లోపం వలన కూడా కలగొచ్చు.

Ads

పిక్కలు పట్టేస్తే రిలీఫ్ ని ఇలా పొందొచ్చు:

#1. ఏదైనా నూనె రాయడం లేదంటే పెద్దలు చెప్పే చిట్కాలని పాటించడం వలన రిలీఫ్ ని పొందవచ్చు.
#2. వ్యాయామ పద్ధతుల్ని అనుసరించడం వలన బయటపడవచ్చు.
#3. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే టెంపరరీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు పర్మినెంట్ సొల్యూషన్ లేకపోయినా ఎప్పటికప్పుడు రిలీఫ్ ని పొందడానికి అవుతుంది.

ఈ ఆసనాలు వేయండి:

మోకాళ్ళ నొప్పులు ఉంటే శశాంకసనం బాగా పనిచేస్తుంది. మోకాళ్ళు బలపడతాయి కూడా. అవయవాలకి రక్తప్రసరణ బాగా జరిగి మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది. వయసు పెరగడం వలన కూడా రాత్రిపూట పిక్కలు పట్టేస్తుంటాయి కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది.

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. నిర్లక్ష్యం అస్సలు చేయకండి. నిర్లక్ష్యం చేస్తేనే సమస్యలు ఇంకా పెద్దవి అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందు సూచనలు కనిపించినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Previous articleతెలుగు వ్యక్తి మీద బాలీవుడ్ వాళ్ళ బయోపిక్..! “మన వాళ్ళు ఏం చేస్తున్నారు..?” అంటూ కామెంట్స్..!
Next article“ఇడియట్” నుండి… “సరిలేరు నీకెవ్వరు” వరకు… ప్రేమ పేరుతో “అభ్యంతరకరమైన సీన్స్” ఉన్న 8 సినిమాలు..!