గజిని సినిమాని తిరస్కరించిన 12 మంది స్టార్‌ హీరోల లిస్ట్..

Ads

తమిళ స్టార్‌ డైరెక్టర్ మురుగదాస్‌ సినీ ప్రేక్షకులకు సూపరిచితమే. ఆయన ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన సూర్య హీరో తెరకెక్కించిన చిత్రం గజిని. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం పొందింది.

తెలుగులోనూ విజయం సాధించింది. ఈ సినిమాలో సూర్యకు జంటగా హీరోయిన్ ఆసిన్‌ నటించింది. ఈ సినిమాని బాలీవుడ్ లో గజిని పేరుతో అమీర్‌ఖాన్‌ రీమేక్‌ చేశారు. బాలీవుడ్ లో కూడా హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరో సూర్య నటనతో పాటుగా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంటాయి. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వారి వరకు అప్పట్లో ఎక్కడ చూసినా ఈసినిమా పాటలే వినిపించేవి. అంతగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకి హారిస్‌ జయరాజ్‌ మ్యూజిక్ ను అందించారు. అయితే ఈ స్టోరీ సూర్య కన్నా ముందుగా దర్శకుడు పన్నెండు మంది అగ్ర నటులకు చెప్పారంట. అయితే వారందరూ ఈ స్టోరీని రిజెక్ట్ చేశారంట. చివరికి గజిని సినిమాలో నటించే అవకాశాన్ని సూర్య దక్కించుకున్నారు. ఆయన కథ వినగానే ఒకే చేశారంట. ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యింది.
2003లో మురుగదాస్‌ ఈ సినిమా స్టోరీని పట్టుకుని చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళారాంట. ఇక ఆ క్రమంలో మొదటగా మురుగదాస్‌ ఈ కథను ప్రొడ్యూసర్ సురేష్‌ బాబుకు చెప్పారంట. అప్పుడు ఆయన ఈ సినిమా మహేష్‌ బాబు చేస్తే బాగుంటుందని అనుకున్నారంట. అయితే ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ తరువాత వెంకటేష్‌ ను అనుకుని అడిగితే గుండుతో నటించేందుకు ఆయన అంగీకరించలేదట. అలా ఆయన తప్పుకున్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, కమల హాసన్‌.. ఇలా 12 మంది అగ్రనటులు గజిని కథను రిజెక్ట్‌ చేశారు. చివరకు సూర్యకి కథ చెప్పగా, ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఆ పన్నెండు మంది హీరోలు ఎవరో చూద్దాం..

Ads

1.మహేష్ బాబు
2. మాధవన్3. మోహన్ లాల్4. కమల్ హాసన్
5. అజిత్ 6. వెంకటేష్ 7. రజిని కాంత్ 8. శింబు
9. అజయ్ దేవగన్ 10. సల్మాన్ ఖాన్
11. విజయ్
12. విక్రమ్
Also Read: స్మోకింగ్ అలవాటును మానేసి, అభిమానులకు ఆదర్శంగా నిలిచిన 10 మంది స్టార్ హీరోలు వీరే..

 

Previous articleఅత్తా కోడలు ఎందుకు గొడవ పడతారు…? దాని వెనుక సైకలాజికల్ రీజన్ ఉందా..?
Next articleన్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.