Ads
పెద్దవాళ్లు గత రోజులే మంచివి వచ్చే రోజులన్నీ గడ్డువే అని ఊరికే చెప్పలేదు ప్రస్తుత పరిస్థితులను చూసి గతంలోకి వెళ్తే ఆ రోజులు ఎంత బాగున్నాయో అని అనిపించక మానదు. అప్పటి వాతావరణం,అప్పటి ప్రశాంతత, అప్పటి ఖర్చులు అప్పటి అనుబంధాలు ఎంతో బాగుండేవి అని పెద్దవాళ్లు చెప్తుంటే విని ఆనందించే వాళ్ళం ఇన్నాళ్లు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు కొన్ని ఈ మధ్య నెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఒకసారి రెస్టారెంట్లో ఫుల్ మీల్ తిన్న బిల్లు 26 రూపాయలని ఒక ఫోటో తెగ వైరల్ అయింది. మరొకసారి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సిసి బైక్ 19000 పెట్టుకున్న బిల్లు కూడా అంతే వైరల్ అయింది. అలాగే ఒక సైకిల్ ని 18 రూపాయలకి కొన్న బిల్ చూసి జనాలు అవాక్కయ్యారు. అలాంటి బిల్లే ఒకటి ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.అదేమిటంటే 1963 ఫిబ్రవరి రెండు నాటి పెట్రోల్ రిసిప్ట్ ఒకటి ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసారు.
Ads
అందులో ఒక వ్యక్తి భారత్ పెట్రోల్ పంపు నుంచి కేవలం 3 రూపాయల 60 పైసలకు ఐదు లీటర్ల పెట్రోల్ పోయించుకుంటాడు. అంటే ఒక లీటర్ పెట్రోల్ 72 పైసలు అన్నమాట. ఆ బిల్ ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. ఆ రేట్లు చూసిన నేటి ప్రజానీకం నేటి పెట్రోల్ రేట్లు పై మండి పడుతున్నారు అప్పటి ధరకు కాకపోయినా సామాన్యునికి అందుబాటులో ఉండేలా పెట్రోల్ రేట్లు దిగి వస్తే బాగుండు అంటున్నారు.
ఏది ఏమైనా ఆ రోజులే వేరు కదా అంటూ ఈ బిల్లులు చూసిన జనాలు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం నాటి ధరలతో పాటు నాటి సంపాదన కూడా అంచనా వేయండి నేటి సంపాదన అంచనా వేయండి అంటూ ధరలతో పాటు సంపాదన కూడా పెరిగిందని సమాధానం పడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.