Ads
రాయల్ ఎన్‌ఫీల్డ్, భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ లని చెప్పవచ్చు. యూత్ కి వీటిపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. లైఫ్ లో ఒకసారి అయిన ఈ బైక్ ని నడపాలనుకునే వారు చాలామంది ఉంటారు. ఈ బైక్ లలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 గత కొన్ని సంవత్సరాలుగా భారతీయుల మనసులో స్థానాన్ని పొందింది.
ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే 1986లో ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే ఉండేదంట. దీనికి సంబంధించిన ఓల్డ్ బిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల చరిత్ర కూడా పెద్దదే. గతంలో ఈ బైకుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువత ఇష్టపడే బైకులలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc దేశంలో చాలా పాపులర్ అయిన బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని ఏళ్లుగా నిరంతరం అభివృద్ది చెందుతూ వస్తోంది. కానీ బైక్ రూపాన్ని మాత్రం అలానే కొనసాగిస్తూ వచ్చారు.
‘ఇంగ్లాండ్’లో వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందినటువంటి కంపెనీ తొలి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత కాలంలో ఇండియన్ కార్ల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లైసెన్స్ పొందింది. 1954లో గవర్నమెంట్ 800 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. వీటిని బట్టి అప్పట్లో ఈ బైక్ ఎంత ఆదరణ ఉండేదో అర్థమవుతుంది.
1986లో రూ. 18,700తో కొనుగోలు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ పాత బిల్లు నెట్టింట్లో షికారు చేస్తోంది. ఈ బైక్ ను జార్ఖండ్‌లో బొకారోలోని సందీప్ ఆటో కంపెనీ అనే డీలర్ 1986, జనవరి 23న రూ.18,700కు విక్రయించింది. ఈ బిల్లును చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: స్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!