Ads
ఒకప్పుడు మూవీ ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని బట్టి దాని సక్సెస్ రేట్ అంచనా వేసేవారు .కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ మూవీ యొక్క ఆదాయాన్ని నిర్ణయించడంతోపాటు ,అది ఇండస్ట్రీలో హిట్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెబుతుంది. బ్రేక్ ఈవెన్ అనేది సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వచ్చిందా, లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా అనే విషయాన్ని స్పష్టంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది.
ఈ సంవత్సరం స్టార్టింగ్ లో బ్రేక్ ఈవెన్ సాధించదమే కాకుండ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను మించి వసూలు రాబట్టిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని స్టార్ హీరోలు నటించిన చిత్రాలు ఉంటే మరికొన్ని ఎటువంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఉన్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు మూవీస్ ఇట్టే హిట్ అవుతాయి అనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓ లుక్కేద్దామా…
వాల్టెయిర్ వీరయ్య
చిరంజీవి ,రవితేజ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలోకి దిగిన ఈ చిత్రం మొత్తానికి 138 కోట్లు వసూలు చేసింది.
వీర సింహారెడ్డి
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన వీర సింహారెడ్డి చిత్రం 74 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగి 80 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
వారసుడు
కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన మొదటి స్ట్రైట్ తెలుగు చిత్రం వారసుడు బ్రేక్ ఈవెన్ 15 కోట్లు కాగా 15.05 కోట్ల వసూలు రాబట్టింది.
రైటర్ పద్మభూషణ్
Ads
కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కలర్ ఫోటోతో హీరోగా మారిన సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 12 కోట్ల వసూలు రాబట్టింది.
SIR
ధనుష్ మెయిన్ లీడ్ లో నటించిన 6.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉన్న సార్ చిత్రం 24 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
బలగం
చాలా చిన్న సినిమాగా కేవలం ఒకటే పాయింట్ మూడు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన బలగం చిత్రం 12.5 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
దాస్ కా ధమ్కీ
మాస్ కా దాస్ విశ్వక్ దాస్ కా ధమ్కీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 11.7 కోట్ల వసూళ్లు సాధించింది.
దసరా
నాని, కీర్తి సురేష్ ఇంగ్లీషులో నటించిన మాస్ దసరా మూవీ బ్రేక్ ఈవెన్ 49 కోట్లు కాగా ఈ మూవీ 63.5 కోట్ల వసూలు రాబట్టింది.
విరూపాక్ష
23 కోట్ల బ్రేక్ ఇవ్వండి టార్గెట్ తో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం 48.2 కోట్ల వసూలు రాబట్టింది.
సమాజవరగమన
చాలాకాలం తర్వాత వచ్చిన ఫుల్ స్వింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న సామజ వరగమన 3.5 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగి ఏకంగా 32 కోట్లు వసూలు సాధించింది.