Ads
2023 సంవత్సరం టాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదు.ఈ సంవత్సరం కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్న కూడా ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఒకసారి వాటి లిస్టు పరిశీలిస్తే…!
2023లో అతిపెద్ద డిజాస్టర్ అంటే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో పిరియాడిక్ మూవీ సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా డిజాస్టర్ లిస్టులో చేరింది. రవితేజ ప్రయోగాత్మకంగా నటించిన రావణాసుర సినిమా, పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటించిన బ్రో సినిమాలు కూడా ఫ్లాపులుగా మిగిలాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో కూడా ట్రోల్స్ కి గురైంది. చిరంజీవి నటించిన భోళాశంకర్ కూడా ఈ లిస్టులోనే చేరింది.
Ads
ఇవి కాకుండా…గోపీచంద్ రామబాణం, కళ్యాణ్ రామ్ అమిగోస్, నాగచైతన్య కస్టడీ, నాగశౌర్య రంగబలి, వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున, రామ్ స్కంద, వైష్ణక్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లాంటి చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలిపోయాయి. ఈ హీరోలందరూ 2024 కొత్త సంవత్సరంలో తిరిగి హిట్ అందుకుంటారేమో చూడాలి.