వీడు మామూలోడు కాదు…22 ఏళ్లు… ఐదుగురు భార్యలు.! అందరు ఒకేసారి తల్లులయ్యారు.!

Ads

రాజరికం కాలం నుండి ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక్కొక్కరు తెలిసి చేస్తుంటే మరొకరు తెలియకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 22 ఏళ్ల వయసులో ఒక అబ్బాయికి ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇక్కడ విశేషం ఇది కాదు. తన ఐదుగురు భార్యలు ఒకేసారి తల్లులయ్యారు…!

Ads

వివరాల్లోకెళ్తే అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన జెడ్డి విల్ ర్యాప్ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. తన పాటలతో దేశంలోని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా అతను తన అయిదుగురు భార్యలను గర్భవతులు చేసి వారికి శ్రీమంతం నిర్వహించి సోషల్ మీడియాలో సంచలనం అయ్యాడు. టిక్ టాక్ ద్వారా అతని భార్య ఆశ్లే ఈ విషయాలను పంచుకుంది. అశ్లే జెడ్డికి మొదటి భార్య. అనంతరం బున్ని అనంతరం బొన్నీ బి, జెలెని వీలా, కె మేరీ, ఇయన లా ఖలిఫా తో అనుబంధం కొనసాగిస్తున్నాడు.
అయితే ఐదుగురు ఒకేసారి గర్భం దాల్చడం విస్మయానికి గురిచేస్తుంది. సహజ పద్ధతిలో ఇది సాధ్యమయ్యే పనికాదు.

తాము ముందుగానే ప్రణాళికలు వేసుకుని ఇది సాధ్యమయ్యేలా ప్లాన్ చేసుకున్నామనీ జెడ్డి మొదటి భార్య ఆశ్లే తెలిపింది.మా ప్రసవం తేదీ సమీపిస్తోంది…మేమందరం కవలలకు జన్మ ఇస్తున్నాం అని మరో భార్య తెలిపింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ కామెంట్లు చేస్తున్నారు నువ్వు మగాడివి రా బుజ్జి అంటూ ఒకరు కామెంట్ పెడితే… నీ వయసెంత నువ్వు చేసే పని ఏంటి అని మరొకరు పెడుతున్నారు

 

Previous articleఅయోధ్య ప్రాణప్రతిష్టలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఈయనే… ఎవరో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!
Next articleప్రధాని మోదీ అయోధ్య రామయ్యకు ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.