Ads
ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే దేనినీ పొందలేము. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారా..? 30 ఏళ్లు దాటిన మహిళలు మాత్రం కచ్చితంగా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా ఉండడానికి వీటిని తప్పక అనుసరించాలి.
30 తర్వాత థైరాయిడ్, అధిక రక్తపోటు, మానసిక ఇబ్బందులు మొదలైనవి వస్తూ ఉంటాయి. అందుకనే 30 నుండి 40 సంవత్సరాల మధ్య గల స్త్రీలు కచ్చితంగా ఈ ఆరోగ్య చిట్కాలని పాటించాలి అప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. పైగా కొన్ని సమస్యలు మీ దరి చేరవు.
#1. కూరగాయలు:
ఆకుకూరలను, కూరగాయలను డైట్ లో చేర్చుకోండి వీటిని తీసుకోవడం వలన మీకు పోషక పదార్థాలు బాగా అందుతాయి.
#2. వెల్లుల్లి:
Ads
వెల్లుల్లి ని వంటల్లో ఉపయోగించండి. వెల్లుల్లి తో చాలా రకాల వంటలు మనం తయారు చేసుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బోలు ఎముకలు వ్యాధి వస్తూ ఉంటుంది ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే వెల్లుల్లి ని తప్పక తీసుకోండి. పైగా మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యని కూడా వెల్లుల్లి రానివ్వకుండా చేస్తుంది .కాబట్టి వెల్లుల్లిని తప్పకుండా తీసుకుంటూ ఉండండి.
#3. గుడ్లు:
గుడ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. ఫ్యాట్, ప్రోటీన్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ డి ని కూడా దీని ద్వారా మనం పొందవచ్చు.
#4. సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫ్రూట్స్ ని డైట్ లో చేర్చుకోవడం వలన మహిళల ఆరోగ్యం బాగుంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ గా సిట్రస్ ఫ్రూట్స్ పని చేస్తాయి. హృదయ సంబంధిత సమస్యలు కూడా వీటి వలన ఉండవు. క్యాన్సర్ ప్రమాదం ఉండదు. కాబట్టి మహిళలు తప్పకుండా వీటిని ఫాలో అవ్వాలి.