Ads
ప్రస్తుతం చిన్న బడ్జెట్ సినిమాకు కూడా కోట్లలో ఖర్చు పెడుతున్నారు. ఇక నటీనటులు వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో నిర్మాతలు డబ్బులు ఎక్కువే ఖర్చు పెడుతున్నారు.
Ads
ఒక పాట కోసం హీరో హీరోయిన్స్ పది, పదిహేను కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. అది కూడా డిఫరెంట్ గా ఉండే విధంగా చూసుకుంటున్నారు. అయితే కొన్ని సినిమాలను ఒకే ఒక్క డ్రెస్ తో పూర్తి చేసారు. మరి అలాంటి 8 సినిమాలు ఏమిటో చూద్దాం.. 1. అ(AWE)
హీరో నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నటించిన కాజల్, రెజీనా, నిత్యమీనన్, అవసరాల శ్రీనివాస్ ఆల్టో పాటుగా మొత్తం సినిమాలో నటించిన అందరు ఒకేటే కాస్ట్యూమ్ ధరించారు.
2. శంకర్ దాదా ఎంబిబియస్ – శ్రీకాంత్
శంకర్ దాదా ఎంబిబియస్ లో ఎటిఎం పాత్రలో హీరో శ్రీకాంత్ సినిమా మొత్తం ఒకే డ్రెస్ తో కనిపిస్తాడు.
3. సోన్ చిరియా..
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించాడు. ఈ మూవీలో సుశాంత్, భూమి ఫడ్నేకర్, మనోజ్ వాజ్ పేయ్ లతో పాటుగా అందరు ఒకటే డ్రెస్ లో కనిపిస్తారు.
4. మిస్టర్ ఇండియాలో అనీల్ కపూర్:
1987లో వచ్చిన ఈ సినిమలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు. అనిల్ కపూర్ మిస్టర్ ఇండియా మూవీ మొత్తం ఒకే డ్రెస్ లోనే ఉంటారు.5. చమేలీ –కరీనా కపూర్:
కరీనా కపూర్ ఈ సినిమాలో వ్యాంప్ పాత్రలో నటించింది. ఆమె ఈ మూవీలో ఒకటే డ్రెస్ తో కనిపిస్తారు.
6. ఖైదీ– కార్తీ
ఖైదీ మూవీలో హీరో కార్తీ నటించారు. ఈ సినిమా మొత్తం కార్తీ ఒకటే డ్రెస్ తో కనిపిస్తారు.7. గులాబ్ గ్యాంగ్– మాధురీ దీక్షిత్
మాధురీతో దీక్షిత్ తో పాటు ఆమె గ్యాంగ్ కూడా ఈ మూవీ మొత్తం గులాబీ చీరల్లోనే కనిపిస్తారు.
8. NH10- అనుష్కశర్మ
ఈ సినిమాలో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఈ సినిమాలో సింగిల్ కాస్ట్యూమ్ లోనే కనిపిస్తుంది.
Also Read: తెలుగులో ఒకే టైటిల్ తో విడుదలైన అయిన సినిమాలు ఏమిటో తెలుసా?