Ads
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా అలుపెరుగని పోరాటం సాగించారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. దీనికి హుజూరాబాద్ ఉప ఎన్నికే చక్కటి ఉదాహరణ. ఆనాడు తనను ఓడించేందుకు కేసీఆర్ పన్నిన కుటిల ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టి ప్రజలతో కలిసి బుద్ధి చెప్పారు ఈటల.
ఉప ఎన్నిక సమయంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగింది. ప్రభుత్వ పెద్దలు, బడా లీడర్లు, చోటా మోటా నేతలను హుజూరాబాద్ లో దింపి ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
అసలు, నియోజకవర్గానికి రాని బీఆర్ఎస్ నేత లేడంటే అతిశయోక్తి కాదు. అలాగే, అధికారులు వారు చెప్పిందల్లా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విందులు, వినోదాలు, చీరలు, డబ్బులు ఇలా ఒకటేంటి..
అన్ని రకాల ప్రలోభాలు నియోజకవర్గంలో జరిగాయి. కేసీఆర్ అయితే.. డే టు డే అప్డేట్ తీసుకుంటూ ఈటలను ఓడించేందుకు ఏం చేయాలో అన్నీ చేశారు. అధికార పార్టీ డబ్బులను నమ్ముకుంటే.. ఈటల మాత్రం ప్రజల్నే నమ్మారు.
Ads
ఆ ప్రజా సైన్యంతోనే కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టారు. అంత ధన ప్రవాహంలో కూడా నియంతృత్వాన్ని తిప్పికొట్టి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఉద్యమకారుడు కాబట్టే ఆయన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో రాజేందర్ పోరాటం మరువలేనిది.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాల వారికి దగ్గరయ్యారు.
అట్టడుగు వర్గాల్లో ధైర్యం నింపి అండగా నిలబడ్డారు. నమ్ముకున్న వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నైజం కావడంతో.. వెనుకబడిన వర్గాలకు ఆశాజ్యోతిగా మారారు ఈటల.
ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ను కూల్చి.. తెలంగాణ అంతటా కాషాయ జెండా రెపరెపలాడించేందుకు చూస్తున్నారు రాజేందర్.
దీనికోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. అధిష్టానం కూడా ఈయనపై ఎంతో నమ్మకం పెట్టుకుంది.
కేసీఆర్ ను బలంగా ఢీకొట్టగలరని భావిస్తోంది. అందుకే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ను చేసింది. ఆ పదవీ బాధ్యతలను శుక్రవారం ఈటల చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.