Ads
విజయ్ సేతుపతి.. తెలుగు మరియు తమిళ్ రెండు భాషలలో వరుసటైల్ యాక్టర్ గా గుర్తింపు పొంది.. వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు.
తనదైన శైలిలో నటించడమే కాకుండా వైవిద్య భరితమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ సేతుపతి సినీ ఫీల్డ్ లోకి రావాలి అనుకున్న ఎందరికో ఇన్స్పిరేషన్. ఒక చిన్న అకౌంటెంట్ నుంచి టాప్ హీరోగా అతని ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు.
‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే తమిళ్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విజయ్ సేతుపతి తమిళ్లో పలు చిత్రాలకు నిర్మాతగా, స్క్రీన్ ప్లే మరియు పాటల రచయితగా, గాయకుడిగా వ్యవహరించారు.2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.ఆ తర్వత ఉప్పెనలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ లో నటించిన విజయ్ సేతుపతి ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యారు.
Ads
విభిన్నమైన పాత్రలు చేయడమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి మంచి నటుడుగా ఎదిగిన విజయ్ సేతుపతి తొలి దశలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒకసారి తమిళ్ డైరెక్టర్ బాలు మహేంద్ర విజయ్ సేతుపతిని కలిసినప్పుడు .. మీది మంచి ఫోటో దానికి ఫేస్ కాబట్టి ఒకసారి సినిమాలో ట్రై చేయండి అని అడ్వైస్ ఇచ్చారట. అలా చెన్నైకి వచ్చి ఒక సినీ కళాకారుల బృందంలో సభ్యుడిగా చేరాడు విజయ్ సేతుపతి.
అదే సమయంలో ధనుష్ నటిస్తున్న పుదుపేట్టై…తెలుగులో ధూల్‌పేట అని డబ్బింగ్ అయిన చిత్రం. ఇందులో ధనుష్ పక్కన అతని స్నేహితుడిగా విజయ్ సేతుపతి నటించారు.ఇలా ధనుష్ పక్కన సైడ్ యాక్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన విజయ్ సేతుపతి ఇప్పుడు ధనుష్ కే పోటీ వచ్చే రేంజ్‌కు ఎదిగాడు. స్వయంకృషితో నటుడిగా ఎదగడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్.
ALSO READ : పవన్ కళ్యాణ్ “బ్రో” సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏం అన్నారంటే..?