పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తో తెరకెక్కిన తమ్ముడు సినిమా …

Ads

ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనసుకు హత్తుకుపోతాయి. వాటిలో కొన్ని ఎంతో రియలిస్టిక్ గా ఉండడమే కాకుండా చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం ఒకటి. ఎప్పటికీ బోర్ కొట్టకుండా ఎవరు గ్రీన్ లా ఉండే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఒక మలుపు తిప్పింది.

ఏ మూవీలో కేవలం ఒక్క సీన్ అని కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాస్త కూడా బోర్ అనేది లేకుండా ఎంతో ప్రెసెంట్ గా సాగుతుంది. పవన్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ తమ్ముడు చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్ బాక్సింగ్ నేర్చుకోవడానికి రాత్రి మొత్తం వర్షంలో తడుస్తూ ఉండే సీన్ మనకు గూస్ బుంప్స్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సీన్ పవన్ లైఫ్ లో ఒక రియల్ ఇన్సిడెంట్ లో జరిగిన విషయం అట.

Ads

చెన్నైలో షెహాని హుస్సేన్ అని కరాటే మాస్టర్ దగ్గర కరాటే నేర్చుకోవడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను మాస్టర్ నేను ఖాళీగా లేను ఈ మధ్య నేర్పించడం మానేశాను వెళ్ళిపో అన్నారట. కానీ పట్టు వదలని పవన్ మీ దగ్గరే కరాటే నేర్చుకుంటాను అని భీష్ముంచుకొని కూర్చున్నాడట. ఈ నేపథ్యంలో షహాని గారు ఒకరోజు పవన్ కళ్యాణ్ మార్నింగ్ ఐదు నుంచి నైట్ 11 వరకు నా దగ్గరే ఉంది ఖాళీ టైంలో నేర్పిస్తాను అని చెప్పారట.

పవన్ 15 రోజుల పాటు పొద్దున నుంచి రాత్రి వరకు ఆయన దగ్గరకు వెళ్లేవాడట. పవన్ కళ్యాణ్ డెడికేషన్ కి ముచ్చట పడ్డ ఆయన ఫైనల్ గా సంవత్సరం పాటు పవన్ కి కోచింగ్ ఇచ్చారు. అతని దగ్గర పొందిన శిక్షణ తోటే పవన్ బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. అయితే ఇదంతా జరిగిన సమయంలో పవన్ చిరంజీవి తమ్ముడు అన్న విషయం ఆ కరాటే మాస్టర్ కి అస్సలు తెలియదట. అలా పవన్ రియల్ స్టోరీని తమ్ముడు మూవీలో చూపించడం జరిగింది.

Previous articleఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు పరమ శివుడిగా మెప్పించిన 15 మంది తెలుగు నటులు వీరే..
Next articleనోరుజారి ఇండస్ట్రీ లో అవకాశాలని కోల్పోయిన… 6 నటులు వీళ్ళే..!