Bro Movie Review: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ హిట్టా..? ఫట్టా..?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • సినిమా: బ్రో
  • నటీనటులు : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు
  • దర్శకుడు: సముద్రఖని
  • సంగీతం : ఎస్ థమన్
  • నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్, జీ స్టూడియోస్,
  • విడుదల తేదీ: జులై 28, 2023
    స్టోరీ :

పనికి ప్రాధాన్యత ఇస్తూ బిజీగా ఉండే యువకుడు మార్కండేయ (సాయి ధరమ్ తేజ్), తండ్రి చనిపోవడంతో బిజినెస్ బాధ్యతలు అతనే తీసుకోవాల్సి వస్తుంది. మరో వైపు కుటుంబ బాధ్యతలు కూడా అతనే చూసుకోవాలి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతాడు. క్షణం కూడా తీరిక లేకుండా అతని బిజినెస్ కోసం వర్క్ చేస్తుంటాడు. అలా కుటుంబాన్ని, లవర్ ను, ఫ్రెండ్స్ ను పక్కన పెట్టేస్తాడు.ఇతరుల ఎమోషన్స్, అభిప్రాయాలు తెలుసుకోవడానికి అతనికి టైమ్ ఉండదు.అనుకోకుండా మార్కండేయ ఒక యాక్సిడెంట్ లో మరణిస్తాడు.ఆ సమయంలో టైమ్ గాడ్ (పవన్ కళ్యాణ్) అతనికి కనిపిస్తాడు.మార్కండేయ జీవితంలోకి టైమ్ గాడ్ వచ్చిన తరువాత ఏం జరిగింది? మార్కండేయ బాధ్యతలనునెరవేర్చడా? టైమ్ గాడ్ ఏం చేశాడు? అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే..

రివ్యూ:

Ads

కోలీవుడ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది.తంబి రామయ్య చేసిన పాత్రను తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించాడు. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ని స్టైలిష్ లుక్‌ లో కనిపించాడు. ప్రధమార్ధంలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ఆయన మాస్ ఎంట్రీ హైలెట్ గా నిలుస్తాయి.పవన్ సాయి తేజ్ తో కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అలరిస్తాయి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకి ఫుల్ మీల్. పవన్ డాన్సులు,జోక్స్ ఆకట్టుకుంటాయి. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది.అయితే ఎమోషన్ సన్నివేశాలలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.

త్రివిక్రమ్ డైలాగ్స్,స్క్రీన్ ప్లే పై చాలా అంచనాలు ఉంటాయి. కానీ ఈ మూవీలో కొంచెం తగ్గిన భావన కలుగుతుంది. థమన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది, పాటలు అంతగా ఆకట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ ఓల్డ్ సాంగ్స్ చిన్న బిట్స్ అలరిస్తాయి.సెకండ్ హాఫ్ బలహీనమైన కథనంతో సాగుతుంది.

ప్లస్ పాయింట్స్:

  • పవన్ కళ్యాణ్,
  • ఫస్ట్ హాఫ్
  • డైలాగ్స్
  • బీజీఎం
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • బలహీనమైన కథనం
  • వీఎఫ్ఎక్స్
  • పాటలు

రేటింగ్:

3/5

watch trailer :

Previous articleమిస్ వరల్డ్..మిస్ యూనివర్స్ మధ్య వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా?
Next articleరాఖీభాయ్ తల్లి పాత్రలో నటించిన నటి రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.