Ads
కొంతమంది నటులు సినిమాల్లోనే హీరోలు కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలే. ఎందరికో వీళ్ళు సహాయం చేశారు. చాలా మందికి అండగా నిలబడ్డారు. మరి సహాయం చేసి అండగా నిలబడిన హీరోల గురించి.. వారు చేసిన సహాయం గురించి చూద్దాం.
చాలా మంది హీరోలు గ్రామాలను దత్తత తీసుకోవడం.. అనాధ శరణాలయాన్ని నిర్మించడం.. వృద్ధాశ్రమాలు, గోశాలలు వంటివి కట్టడం ఇలా ఎంతగానో సేవలు అందించారు. మరి రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా ప్రూవ్ చేసుకున్న పది మంది నటుల గురించి ఇప్పుడు చూసేద్దాం.
#1. చిరంజీవి బ్లడ్:
చిరంజీవి ఈతరం హీరోలకి ఆదర్శం. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో ఏ. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవలని అందిస్తున్నారు చిరంజీవి.
#2.మహేష్ బాబు:
మహేష్ బాబు కూడా సేవలు చేస్తున్నారు. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ని చేయిస్తున్నారు మహేష్. 1000 మందికి పైగా చిన్నారులకు ఫ్రీ గా గుండె ఆపరేషన్లని చేయించారు.
#3. పునీత్ రాజ్ కుమార్:
16 వృద్ధాశ్రమాలు, 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు, 19 గోశాలలను నిర్మించారు. అలానే 1800 మందికి ఉచిత విద్యను ఇస్తున్నారు.
#4. బాలకృష్ణ:
సీనియర్ ఎన్టీఆర్ గారు కాన్సర్ తో ఆయన భార్య చనిపోవడంతో కాన్సర్ హాస్పిటల్ ని కట్టించారు. ఇప్పుడు ఈ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్. ఫ్రీ గా కాన్సర్ సర్జరీస్ ని ఇక్కడ చేయిస్తున్నారు.
Ads
#5. నాగార్జున:
బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ ని మొదలుపెట్టి మూగ జీవాలను సంరక్షిస్తున్నారు.
#6. పవన్ కళ్యాణ్:
పావలా శ్యామల కి సహాయం చేసారు. అలానే సర్దార్ గబ్బర్ సింగ్ టెక్నీషియన్ కి సహాయం చేసారు. అలానే చాలా సొసైటీస్, ఛారిటీలకు కూడా ఆయన ఆర్ధిక సాయం చేసారు.
#7. సూర్య:
సూర్య భార్య జ్యోతికతో కలిసి అగరం ఫౌండేషన్ ని స్టార్ట్ చేసారు. దీని ద్వారా ఎంతగానో సేవ చేస్తున్నారు.
#8. ప్రభాస్:
బ్లైండ్ స్కూల్ కి ఈయన 10 లక్షలు విరాళం ఇవ్వడమే కాక కొందరి పిల్లల బాగోగులు కూడా ప్రభాస్ చూసుకుంటున్నారు.
#9. ప్రకాష్ రాజ్:
తెలంగాణ లోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఈయన దత్తత తీసుకున్నారు.
#10. సుమన్:
తెలంగాణలోని సుద్దపల్లి గ్రామాన్ని ఈయన దత్తత తీసుకున్నారు.
#11. రాఘవ లారెన్స్:
ట్రస్ట్ ద్వారా చాలా మందికి ప్రాణదానం చేస్తున్నారు రాఘవ లారెన్స్.