Ads
జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. ఇద్దరు వ్యక్తులు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అయితే చాలా మందికి ఇది తీపి అనుభవాన్ని ఇస్తే కొందరి జీవితంలో మాత్రం ఇది చేదుగా మిగిలిపోతుంది. ఇద్దరి మధ్య బంధం తెగిపోవడానికి వివాహేతర సంబంధాలు కూడా కారణాలవుతాయి.
అయితే ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..?, వీటికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. పూర్వ కాలంలో చిన్న వయసులో పెళ్లి చేసే వారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని చాలా మంది భావించి దానిని ఎంజాయ్ చేసే క్రమంలో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
#2. ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేయడం వల్ల ఇష్టం లేకున్నా కూడా కొందరు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత భాగస్వామి కంటే ఆకర్షణీయంగా కనిపించే వాళ్లతో సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఇలా కూడా ఆ పెళ్లి అనే బంధం ముక్కలై పోతుంది.
Ads
#3. భార్య గర్భవతి అయినప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. ఈ గ్యాప్ రావడం వల్ల భర్త మరొకరితో సంబంధం పెట్టుకుంటారు.
#4. కుటుంబ సభ్యులకి లేదా ఎవరికైనా బాగోక పోవడం, ఆకస్మికంగా ఎవరైనా చనిపోవడం, ఉద్యోగం పోవడం లాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దంపతుల్లో ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు.
#5. ఒకరికి ఒకరు ఆనందంగా లేకపోయినా, ఒకవేళ వాళ్ళు యొక్క దాంపత్య జీవితం బాగాలేదు అని అనిపించినా ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. శృంగారంలో కూడా అంతలా ఎంజాయ్ చేయలేకపోతున్న కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు.
చిన్న వాటిని కూడా పెద్దగా సాగ తీసుకుంటూ చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. ఏదిఏమైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. గౌరవించుకోవడం ఇద్దరూ కలిపి సమయాన్ని కేటాయించడం లాంటివి చేయాలి. అంతే కానీ ఎప్పుడూ కూడా నేను తగ్గను అని మీ మాట మీద ఉంటే కుదరదు. కొన్ని కొన్ని సార్లు తగ్గడం వల్ల కూడా సమస్యలు సర్దుకుంటాయి లేదు అంటే విడిపోవలసి వస్తుంది.