”ఇటువంటి బట్టలు వేసుకోవద్దు.. మీ మావయ్య కూడా వుంటారు”..పెళ్లయ్యాక ఇలా మారిపోయింది నా జీవితం..!

Ads

పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. పెళ్లికి ముందు వేసుకునే దుస్తులు మొదలు పాటించాల్సిన పద్ధతులు వరకు చాలా మారుతూ ఉంటాయి. పుట్టింట్లో వుండినట్టుగా అత్తింట్లో ఉండడానికి అవ్వదు. పెళ్లి తర్వాత ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఇలాంటి మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య జీవితంలో కూడా ఇలాంటి మార్పులే వచ్చాయి.

సంధ్య సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ళకి పెళ్లి అయ్యింది. ఇంకేముంది సంధ్య జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.

పెళ్లి అయ్యాక భర్త అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఈమె సాయంత్రం పూట పని చేయాల్సి వచ్చేది. ఈవినింగ్ షిఫ్ట్. ఆమె ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున అయ్యేది. తెల్లవారుజామున నిద్రపోయి ఉదయం 10 గంటలకి నిద్రలేచేది. అయితే ఇది ఇప్పుడే కాదు పెళ్లి కాక ముందు కూడా ఆమె ఇలానే పని చేసేవారు. పెళ్లయిన తర్వాత కూడా మూడు గంటలకి ఇంటికి వచ్చి ఉదయం 10 గంటల వరకు నిద్రపోయేవారు.

సంధ్య ఉదయాన్నే 10 గంటలకి లేచి.. అత్త దగ్గరికి వెళ్లి నేను ఏమైనా సహాయం చెయ్యనా అని నవ్వుతూ అడిగేసరికి అత్త మొహంలో నవ్వు లేదు. దీంతో ఏమైంది అత్తయ్య అని ఆమె ప్రశ్నించింది. ఆలస్యంగా నిద్ర లేస్తావ్ ఏంటి 7:00కి నిద్ర లేవచ్చు కదా అని తన అత్తగారు ఆమె కి చెప్పారు. తెల్లవారుజామున నేను నిద్రపోయాను అందుకని ఆలస్యంగా లేచాను అని సంధ్య బదులు ఇచ్చారు.

Ads

ఉదయం ఏడు గంటలకి నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకోమని సంధ్య కి అత్తగారు చెప్పారు. పైగా సంధ్య అప్పుడు నైట్ డ్రెస్ లో ఉన్నారు. ఇలాంటి బట్టలు ఇంక వేసుకోకు.. మీ మామగారు కూడా తిరుగుతూ ఉంటారు కదా..? ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని అత్తగారు చెప్పారు. అతయ్య చెప్పడంతో సంధ్య ఇక నుండి ఏడు గంటలకు లేవడం మొదలుపెట్టారు. పైగా ఉద్యోగానికి వెళ్లే ముందు కూడా అత్తగారు ఏదో ఒక పని చెప్పేవారు. టైం సరిపోదు వెళ్లాలి అని చెప్పినా సరే ఆమె వదిలి పెట్టేవారు కాదు. తన భర్త సపోర్ట్ కానీ మామగారు సపోర్ట్ కానీ ఆమె పొందలేకపోయారు.

అత్తగారు చెప్పినట్లుగానే అనుసరించమని వాళ్ళు చెప్పేవారు. వేరే ఉద్యోగం చూసుకోమని అత్తగారు చెప్పేసరికి ఆమె టీచర్ గా పని చేయడం మొదలుపెట్టారు. అయినా సంధ్య బాధపడలేదు. టీచర్ జాబ్ చేయడం వలన ఇప్పుడు పని వేళలు బాగున్నాయని సాఫ్ట్వేర్ ఉద్యోగం వలన ఆరోగ్యం పాడవుతుందని అత్తయ్య చెప్పారు అని అందుకే మానేసాను అని అందరికీ చెప్పుకున్నారు..

పైగా తన అత్తగారి గురించి కానీ ఆమెని బాధ పెట్టినవి కానీ ఆమె బయట చెప్పుకోలేదు. నిజానికి సంధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డారు. ఎంతగానో కష్టపడితే ఈ ప్లేస్ వచ్చింది. మొదటి చిన్న పోస్ట్ లో పని చేసి ఆ తర్వాత కంపెనీ టాప్ పొజిషన్ లోకి వెళ్లారు. అయినా సరే తనకి ఇష్టమైన జాబ్ వదిలేసుకున్నారు. ఇలా సంధ్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా సంధ్య చేసిన తప్పు ఏంటి..? అవతలి వాళ్ళు ఇతరుల మీద వారి విషయాలని రుద్దడం వలన ఏం వస్తుంది..? అలా చేస్తున్న వాళ్లకే ఈ విషయం తెలియాలి మరి..?

 

Previous articleఆరు నేషనల్ అవార్డులు..! ధనుష్ ని స్టార్ హీరో చేసిన ఈ సినిమా చూశారా..?
Next article“ఇంగ్లీష్ రాకుండా ఉద్యోగం ఎలా చేస్తావు..?” అనే ప్రశ్నకి… IPS అధికారి ధీటైన సమాధానం..! ఏం చెప్పారంటే..?