Ads
స్టార్ హీరోలే కాదు అప్పుడప్పుడు టైర్ టు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త సందడి చేస్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు వీళ్లను నమ్ముకుని తీసిన సినిమాలు అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికెల పడతాయి. మామూలుగా స్టార్ హీరో సినిమాలు సంవత్సరానికి ఒకటో రెండో వస్తే మీడ్ హీరో సినిమాలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. హై బడ్జెట్ భరించలేని నిర్మాతలు అందరూ ఈ ‘టైర్ 2’ హీరోలతో సినిమాలు తీస్తుంటారు.
అయితే ఇలా స్టార్ హీరోల బదులు మిడ్ హీరోలను నమ్ముకొని భారీగా తీసిన యాక్షన్ చిత్రాలు పలు సందర్భాల్లో బోల్తా పడ్డాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..
#1. లై :
నితిన్ హీరోగా 40 కోట్ల బడ్జెట్ తో హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ చిత్రం లై…14 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
#2. ఇంటలిజెంట్:
సాయిధరమ్ తేజ హీరోగా.. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం మొత్తం బడ్జెట్ 38 కోట్లు కాగా 22 కోట్ల నష్టాలను మిగిల్చింది.
#3. కృష్ణార్జున యుద్ధం :
Ads
మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీ 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 15 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
#4. మహాసముద్రం :
శర్వానంద్ ,సిద్ధార్థ కాంబోలో వచ్చిన మహా సముద్రం చిత్రం 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం 10 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
#5. గని :
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 55 కోట్ల బడ్జెట్ తో ఇచ్చిన భారీ యాక్షన్ చిత్రం గని. ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 21 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది.
#6. లైగర్ :
విజయ్ దేవరకొండ హీరోగా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఈ 90 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం 56 కోట్ల నష్టాలు మిగిల్చింది.
#7. ఏజెంట్ :
అఖిల్ అక్కినేని హీరోగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి నిర్మించిన ఏజెంట్ చిత్రం 28 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.