Ads
అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు సరైన జీవన విధానం అనుసరిస్తూ ఉండాలి. అలానే మంచి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుందా లేదా అని పదే పదే పనికి సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే మన ఆరోగ్యం బాగుందా లేదా అనేది మనం మన చేతి గోళ్ళను బట్టి తెలుసుకోవచ్చు.
మన చేతి గోళ్లు రంగు ద్వారా మనం ఏదైనా సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మంది గోళ్లను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ గోళ్లు మనకి చాలా విషయాలను చెబుతూ ఉంటాయి. గోళ్ల ద్వారా అనారోగ్య సమస్యలను ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
#1. తెలుపు రంగులో గోళ్లు ఉండడం:
మన గోళ్లు కనుక తెల్లగా పాలిపోతే కొన్ని రకాల వ్యాధులు వున్నట్టే. న్యుమోనియా, మైకోసిస్, సొరియాసిస్ ఇన్ఫెక్షన్స్ ని ఇది సూచిస్తుంది. సో వెంటనే గ్రహించడం మంచిది. హృద్రోగాలు వంటి ప్రమాదకరమైన సమస్యల వలన కూడా గోళ్లు పాలిపోతాయి. మీ గోళ్లు ఇలా ఉంటే డెర్మటాలజిస్టును కన్సల్ట్ చేయడం మంచిది.
Ads
#2. నీలం రంగులో ఉండడం:
అదే మీ చేతి గోళ్లు కనుక లేత నీలం రంగు లోకి మారాయి అంటే… దీనికి కారణం మీరు కొన్ని రకాల టాబ్లెట్స్ ని వాడడమే. మలేరియా కి సంబంధించి మందులు వేసుకోవడం వలన గోళ్లు నీలంగా మారుతూ ఉంటాయి.
#3. తెల్లటి మచ్చలు ఉండడం:
పిటింగ్ అని అంటారు దీన్ని. సొరియాసిస్, డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యల వలన ఇలా వస్తాయి. జుట్టు సమస్యలు లేదా సుఖ వ్యాధి వల్ల కూడా రావచ్చు.
#4. పసుపు రంగులో ఉండడం:
జన్యుపరమైన వ్యాధులు వలన కానీ వయస్సు పెరగడం వలన కానీ పసుపు రంగులోకి మారతాయి గోళ్లు. లేదా కిడ్నీ సమస్యలు, సొరియాసిస్, హెచ్ఐవీ వలన కూడా ఇలా మారచ్చు.
#5. గోళ్లు మీద గీతలు:
నిలువుగా గీతలు కనుక గోళ్ళ మీద ఉంటే హై ఫీవర్ ఉన్నట్టు. లేదంటే కీమోథెరపీ చికిత్సల తర్వాత ఇలా జరుగుతుంది. మెలనోమా అనే చర్మ సమస్యల వలన కూడా ఈ గీతలు వస్తాయి.