Ads
వెండితెర అందాల తార సిల్క్ స్మిత మళ్లీ నటించిందా అని అనిపించేలా అందరినీ కన్ఫ్యూషన్ లోకి నెట్టింది మార్క్ ఆంటోనీ సినిమా ట్రైలర్ .తమిళ స్టార్ హీరో విశాల్ సినిమా అంటే సినిమా ఆద్యంతం ఒక కొత్త కోణంలో తీస్తారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. అయితే ఈసారి మార్క్ ఆంటోనీ సినిమాతో విశాల్ ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్నారు.
ఈ సినిమాలో విశాల్ మరియు ఎస్ జే సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కనువిందు చేసేలా డిజైన్ చేశారు. గత కొద్దికాలంగా తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్న తెలుగు కమెడియన్ కమ్ హీరో సునీల్ …ఈ మూవీలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. విశాల్ మరియు సునీల్ కి మధ్య ఉండే సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని తెలుస్తుంది.
డైరెక్టర్ మాటలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆద్యంతం ఆసక్తి పుట్టించే కంటెంట్ తో ట్రైలర్ రెడీ చేశారు. ట్రైలర్ కంటే కూడా ట్రైలర్ మధ్యలో కనిపించిన ఒక నటి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. సిల్క్ స్మిత లాగా ట్రైలర్ మధ్యలో కనిపించే కనిపించకుండా మాయమైనా నటి అందర్నీ ఆశ్చర్యంతో ముంచడమే కాకుండా ఆమె ఎవరు అన్న డౌట్ రేపుతోంది.
ఇంతకీ ఈ నటి ఎవరు అని ఆరా తీయగా, సోషల్ మీడియాలో జూనియర్ సిల్క్ గా పిలవబడే విష్ణు ప్రియ గాంధీ అని తేలింది. అచ్చు గుద్దినట్టు సిల్క్ లా హావభావాలు పలికించి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోయర్స్ ని సంపాదించుకున్న విష్ణు ప్రియ ఈ సినిమాతో తళుక్కున మెరిసే ఛాన్స్ దక్కించుకుంది. మూవీ ట్రైలర్ లో కలుపుకొని మెరిసే ఇంత పాపులర్ అయిన ఆమె ముందు…ముందు మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది అని అందరూ ఆశిస్తున్నారు.