Ads
ప్రస్తుతం తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో ఏది అంటే…బిగ్ బాస్ అని అనవచ్చు. తెలుగింటి మంచి ఆదరణ అందుకుంటున్న ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ లో అప్పుడే ఒకరు ఎలిమినేట్ అయిపోవడం కూడా జరిగింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ షో లో జరుగుతున్న పోటీ కంటే, పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కంటే ప్రేక్షకులను ఎక్కువగా త్రిల్ చేసే విషయం బిగ్ బాస్ వాయిస్.
ఎంతో గంభీరంగా, హౌస్ మేట్స్ అందరిని కంట్రోల్ చేసే ఈ వాయిస్ కనిపించని బిగ్ బాస్ కి మరో రూపు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ ని మనం గుర్తుపట్టేది ఈ వాయిస్ తో కాబట్టి.కనీసం ఒక్కసారి అయినా బిగ్ బాస్ చూసే సమయంలో …ఈ వాయిస్ ఎవరిదో అని ఆలోచించే ఉంటారుగా.అయితే ఈ వాయిస్ వెనక ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అతను ఎవరో తెలుసుకుందాం పదండి..
Ads
బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో బిగ్ బాస్ కు వాయిస్ ఓవర్ గా ఉన్న వ్యక్తి పేరు రాధాకృష్ణ ఆలయాస్ రేనుకుంట్ల శంకర్. స్వతహాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శంకర్ బిగ్ బాస్ లో చేయడానికి అంటే ముందు పలు సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు. అంతేకాదు చాలా సీరియల్స్ ,అడ్వటైజ్మెంట్స్ లో అతని గొంతు మనం వినవచ్చు.
అయితే అతనికి ఈ ఆఫర్ అంత సులభంగా రాలేదు వంద మందితో పోటీపడి ఎంతో కష్టం మీద సంపాదించాడు. ప్రస్తుతం రాధాకృష్ణకు సంబంధించి ఏదో అవార్డు వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాకు కూడా గుర్తింపు ఉంటుంది… ఇలా మాకు కూడా అవార్డులు ఇస్తారు అని తెలియదు అని రాధాకృష్ణ అనడం అతని సింప్లిసిటీకి నిదర్శనం.