Ads
మనం మంచి మనసుతో ఆలోచిస్తే కీడు కూడా వెనక్కి వెళ్ళిపోయి మనకి మంచే జరుగుతుంది. అందుకనే ఎప్పుడూ కూడా మంచి చేస్తూ ఉండాలి. మంచినే ఆలోచిస్తూ ఉండాలి. మంచికి మంచే జరుగుతుంది. అయితే అలా చెప్పే ఒక కథ గురించి చూద్దాం. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి మూడు కన్నుల ఉన్న కూతురు పుడుతుంది.
మూడు కన్నులు ఉన్న కూతురు పుట్టడం వల్ల రాజుకి నష్టం కలుగుతుందని… తనకు పెళ్లి చేసే వరకు కూడా ఇబ్బందులు వస్తాయని జ్యోతిషులు చెబుతారు. అయితే కొన్నాళ్ళకి ఆమెకు యుక్తవయసు వస్తుంది.
దీంతో తన కూతురికి పెళ్లి చేసి పంపాలని రాజు నిర్ణయించుకుంటాడు. ఈమెకి మూడు కన్నులు ఉండడంతో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు రాజు మూడు కన్నులు ఉన్న తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే కానుకలు ఇస్తానని చెబుతాడు. అయితే పెళ్లి చేసుకున్నాక తనను తీసుకుని మరొకటి దగ్గరికి వెళ్లి పోవాలి అని షరతు పెడతాడు. ఇలా ప్రకటించినా సరే తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.
Ads
ఒక రోజు ఒక అంధుడు తన వికలాంగుడైన తమ్ముడితో పాటు రాజు దగ్గరికి వస్తాడు. మూడు కన్నుల ఉన్న తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. దీంతో రాజు అతనికి కానుకలు ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు. రాజకుమారి అంధుడైన తన భర్త వికలాంగుడైన మరిది తో కలిసి జీవిస్తూ ఉండేది. తన భర్తకి తెలియకుండా మరిదితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంటుంది.
ఓ రోజు మాత్రం తన భర్త నుంచి బయట పడాలని తన మరిదితో పాటు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. తన భర్తని చంపేయాలని ఇద్దరు ఆఖరికి నిర్ణయించుకుంటారు. ఒక విషపూరితమైన పాముని తీసుకు వచ్చి కూర చేసి తన భర్తకు పెట్టాలని రాజకుమారి, మరిది అనుకుంటూ ఉంటారు. తన భర్త వచ్చిన తర్వాత ఇది చేపల కూర మధ్యమధ్యలో కలుపుతూ ఉండమని చెబుతుంది.
భర్త ఇలా కలుపుతూ ఉన్న సమయంలో ఈమె మరిదితో సరసాలు ఆడుతూ ఉంటుంది. కూరని కలుపుతున్నపుడు ఆ పాము కోరల్లో నుంచి వచ్చే ఆవిరికి చూపు వస్తుంది. భార్య తమ్ముడు తో సరసాలు ఆడటం కనిపిస్తుంది. అయినప్పటికీ చూపులేనట్టే నటిస్తాడు. జరిగిన విషయం అంతా రాజుకు చెప్పగా రాజు తన రెండవ కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. మంచికి మంచే జరిగింది.