Ads
రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే రైలు ప్రయాణం ఎంతో హుషారుగా ఉంటుంది. చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు. పట్టాల మీద నుండి రైలు అలా ముందుకు వెళుతూ ఉంటే దారిలో ఉండే చెట్టులను, పుట్టలను చూసుకుంటూ సరదాగా సమయాన్ని గడపవచ్చు.
అయితే రైలు పట్టాలకు పక్కన ఒక అల్యూమినియం బాక్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బాక్స్ ని మీరు చూశారా..? సహజంగా ఇవి మనకి కనబడుతూనే ఉంటాయి. అయితే అసలు ఎందుకు ఈ అల్యూమినియం బాక్స్‌లని పట్టాల పక్కన ఉంచుతారు..? దీని వెనక ఉండే కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అల్యూమినియం బాక్స్‌లను ఆక్సిల్ కౌంటర్లు అని అంటారు. ఈ బాక్స్‌లలో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే..? రైల్వే డిపార్ట్మెంట్ కి వచ్చిన రైళ్ల సమాచారాన్ని ఇస్తాయి. రైలు పట్టాల కి పక్కన ప్రతి 5 లేదా 6 కిలో మీటర్లకి ఒక బాక్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ బాక్స్ ని లొకేషన్ బాక్సులు అని కూడా పిలుస్తారు.
Ads
వచ్చి వెళ్లే రైళ్ల సమాచారాన్ని ఇవి ఇస్తాయి. ఇక ఇవి ఎలా పనిచేస్తాయి అనే విషయానికి వస్తే.. ఈ బాక్స్ లోపల ఒక డివైస్ ఉంటుంది. డివైస్ కు రైలు పట్టాల మధ్య ఉండే మరో డివైస్ తో వైఫై కనెక్షన్ ఉంటుంది. పట్టాల మీద నుంచి రైలు వెళితే బోగీలు ఎన్ని ఉన్నాయో గుర్తిస్తుంది. ఒక్కొక్క బోగీకి నాలుగు ఆక్సిల్స్ ఉంటాయి. ఒకవేళ రైలుకి 10 బోగీలు ఉంటే 40 ఆక్సిల్స్ వున్నాయి అని అర్థం.
ఈ డివైస్ లో ఆక్సిల్స్ ని కౌంట్ చేసి లొకేషన్ బాక్స్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. ఈ ఆక్సిల్స్ ని బట్టి ఎన్ని బోగీల రైలు పట్టాల మీద నుంచి వెళ్ళింది అనేది తెలుస్తుంది. రావాల్సిన బోగీల కంటే తక్కువ వస్తే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం వెళ్తుంది. అప్పుడు రైల్వే వారు ఏ బోగీ రాలేదనేది తెలుసుకుంటారు. ఇలా సమస్యని పరిష్కరించడం జరుగుతుంది.