భార్యాభర్తలు పిల్లల్ని కనే ముందు.. తప్పక 4 ఈ విషయాలని చూసుకోవాలి..!

Ads

పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క భార్య భర్త కూడా పిల్లలతో కలకలం ఆనందంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలని కన్నాక వాళ్ళని మంచిగా పెంచాలని సరైన దారిలో పెట్టాలని ఆనందంగా ఉంచాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనే ముందు భార్యాభర్త పదేపదే ఆలోచించుకుంటూ ఉండాలి. వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని వారికి వారే ప్రశ్నించుకోవాలి. చాలామంది భార్యాభర్తలు పిల్లలు కనడానికి మంచి సమయం ఏది అని ఆలోచిస్తూ ఉంటారు.

నిజానికి భార్యాభర్త పిల్లల్ని కనే ముందు వీటిని చూసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. మరి ఎప్పుడు పిల్లల్ని కనడానికి సిద్ధపడాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

#1.కెరీర్ మీద మొదట దృష్టి పెట్టండి:

పిల్లలని కనే ముందు ముఖ్యంగా కెరీర్ ని చూసుకుంటూ ఉండాలి. కెరీర్ బాగోకపోతే ఆనందంగా ఉండడానికి అవ్వదు. పైగా పిల్లలు కూడా తర్వాత భారం అవుతారు. కాబట్టి మొదట పూర్తిగా కెరీర్ మీద దృష్టి పెట్టి.. కెరీర్ సరిగా ఉన్నప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. పిల్లల్ని పెంచడం ఈజీ కాదు. పిల్లలు పెంపకం చాలా ఖరీదైనది వాళ్లకి కావాల్సిన బొమ్మలు మొదలు ఆహారం వరకు అన్ని డబ్బుతో కూడుకున్నవే కాబట్టి ఆర్థికంగా స్థిరంగా ఉండాల్సిందే.

Ads

#2. మీ ఆరోగ్య పరిస్థితి:

మీ ఆరోగ్య పరిస్థితిని కూడా చూసుకోవడం ముఖ్యం. మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేసి సంతాన సామర్థ్యాన్ని టెస్ట్ చేయించుకోండి. దీంతో మీకు పిల్లలు వెంటనే కావాలా లేదంటే ఆగాలా అనేది తెలుస్తుంది.

#3. పిల్లల్ని పెంచడం పెద్ద ఛాలెంజ్:

పిల్లల్ని పెంచడం ఈజీ కాదు ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు కాబట్టి పిల్లల్ని ఈజీగా పెంచేవారు. కానీ కేవలం భార్యాభర్త ఉన్న ఇంట్లో అతి పెద్ద చాలెంజింగ్ అనే చెప్పాలి.

#4. మానసికంగా దృఢంగా ఉండాలి:

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా చాలా మార్పులని చూడాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి. మానసికంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. సో మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అప్పుడే పిల్లల కోసం ఆలోచించండి. లేకపోతే మీరే సఫర్ అవ్వాల్సి ఉంటుంది.

Previous article“చంద్రముఖి”లో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సీరియల్ లో.!
Next article30 ఏళ్ళు దాటిన మహిళలు ఆరోగ్యం కోసం.. కచ్చితంగా ఈ 4 తీసుకోండి..!