Ads
మేకప్ అనేది మహిళలకు ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు ఏ పెళ్లికో పేరంటానుకో వెళ్తే మాత్రమే ముస్తాబయ్య పరిస్థితి నుంచి ..నేడు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్న మేకప్ అవసరమయ్యే స్థితికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర స్పెషల్గా తమకంటూ ఓ మేకప్ కిట్ కూడా ఉంటుంది. అయితే మీ మేకప్ లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు మీ మేకప్ ని మార్చాల్సిన అవసరం ఉంటుంది.
ఈ రోజుల్లో పరిపూర్ణంగా యూస్ అయ్యే ఒక మేకప్ కిట్ కొనాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత పెట్టి కొన్నాను కదా అని సంవత్సరాల తరబడి ఒకే మేకప్ కిట్ వాడాలి అంటే.. అది మీ చర్మం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇంతవరకు అవసరమో అంతకు సరిపడే విధంగా చిన్న కిట్లను తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా కంటికి సంబంధించిన ఉపయోగించి మస్కార ఐషాడో లాంటి వాటికి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా అవి సెన్సిటివ్ ఏరియాస్ లో వాడుతాం కాబట్టి ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా చూసుకొని వాడాలి.
Ads
మేకప్ కి వాడే ఫౌండేషన్, ప్రైమర్ లాంటివి వేసుకునే సమయంలో వాసన కాస్త తేడా వచ్చింది అంటే .. అవి పాడైపోతున్నాయి అని అర్థం. బాటిల్ ఇంకా సగం ఉంది అని భద్రపరచుకుంటే మీ స్కిన్ పూర్తిగా డామేజ్ అవ్వడం ఖాయం కాబట్టి వాటిని వెంటనే డిస్పోస్ చేయాలి. ఒకవేళ మీరు కొన్న మేకప్ కిట్ పై ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకపోతే ఓపెన్ చేసి వాడడం మొదలుపెట్టిన కొన్ని నెలల తర్వాత దాన్ని ఆపేయడం మంచిది.
మేకప్ ప్రొడక్ట్స్ చాలా తక్కువగా వాడడమే చర్మానికి ఎంతో మంచిది. వేలు తగలబోసి బయట బ్యూటీ తెచ్చే ప్రొడక్ట్స్ వాడడం కంటే రోజు మనకు లభ్యమయ్యే పండ్లు, ఆకుకూరలు ,కూరగాయలు లాంటివి తీసుకోవడం వల్ల బాహ్య సౌందర్యమే కాకుండా లోపల ఆరోగ్యం కూడా ఎంతో వృద్ధి చెందుతుంది. అందం కోసం కనిపించిన అన్ని ప్రొడక్ట్స్ వాడటం కంటే కూడా మనకు సులభంగా దొరికేటటువంటి సహజసిద్ధమైన వస్తువులను వాడడమే మంచిది.