Ads
హీరోయిన్లకు ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయో పైకి చెప్పకపోయినా బై ఛాన్స్ ఎదురుపడితే మాత్రం వాళ్ళ హావభావాల్లో తెలిసిపోతూ ఉంటాయి. ఇదే రకంగా మొన్న ఎక్స్ప్రెషన్ క్వీన్ రష్మిక ,బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మధ్య ఒక ఆక్వార్డ్స్ సిట్యుయేషన్ ఎదురైంది. పుష్ప చిత్రం పుణ్యమా అని రష్మిక బాలీవుడ్ లో కూడా మంచి ఫాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది.
అసలు విషయం ఏమిటంటే ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు అగ్రతారాగణం అందరూ హాజరైన విషయం తెలిసిందే. అలాగే ఈ వేడుకకు రష్మిక కూడా వెళ్లడం జరిగింది. సరిగ్గా రష్మిక ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంకి అప్పుడే శ్రద్దా ఎదురుగా బయటికి వస్తూ కనిపించింది. మీడియా వాళ్ళు ఫోటోలు అడగడంతో కెమెరా ముందు ఫోజులిస్తున్న రష్మిక తన ఎదురుగా వస్తున్న శ్రద్ధాను చూసి పలకరించింది.
Ads
అయితే శ్రద్దా మాత్రం కనీసం తిరిగి నవ్వలేదు సరి కదా గమ్ముగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రద్దా బిహేవియర్ ఆ సమయంలో రష్మికకు కాస్త ఇబ్బంది కలిగింది అనేది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలిసిపోతుంది. అయితే ఇదంతా కెమెరా కంటికి చిక్కడంతో వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
దీంతో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి రెడీ అయిన శ్రద్దా ….రష్మిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వడమే కాకుండా తన తన యానిమల్ సినిమా పోస్టర్ కి “వాటే బ్యూటీ” అంటూ కామెంట్ కూడా చేసింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో తీస్తున్న “యానిమల్” సినిమాకి సంబంధించి రష్మిక పోస్టర్ తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్ కి శ్రద్ధ కామెంట్ చేసారు.
ఆల్రెడీ ఇద్దరి మధ్య ఒక కాంట్రవర్షల్ వీడియో వైరల్ అయింది కాబట్టి… ఈ కామెంట్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇది డామేజ్ రికవరీ చేస్తుందా లేక కొత్త చర్చకు దారితీస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు రష్మిక పోస్టులలో కనిపించని శ్రద్దా మొదటిసారి అది కూడా ఆ వీడియో వైరల్ అయిన తరువాత కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది కాస్త విడ్డూరంగానే ఉంది. ప్రస్తుతం రష్మిక రణ్‌బీర్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీలో నటిస్తోంది.