15 ఏళ్ల క్రితం లవర్ గా…ఇప్పుడు అదే హీరోకి తల్లిగా నటించనున్న “ప్రియమణి”.! ఎవరంటే.?

Ads

జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ క్రేజీ కాంబోలో వస్తున్న సరికొత్త చిత్రం దేవర. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏ మూవీ విషయంలో మొదటి నుంచి కొరటాల ,జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.

స్క్రిప్ట్ పక్కాగా సెట్ అయ్యేంతవరకు ప్రాజెక్ట్ పట్టాలు కూడా ఎక్కలేదు అంటే ఈ మూవీ విషయంలో వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో కొరటాల తన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై మరింత పకడ్బందీగా ఫోకస్ పెట్టారు.

Ads

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా…సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే…ఈ సినిమాకి సంభందించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ కు తల్లి క్యారెక్టర్ లో నటించనున్న హీరోయిన్ ఎవరో కాదు ప్రియమణి. అవునండి ఎన్టీఆర్ తో యమదొంగ చిత్రంలో హీరోయిన్ గా చేసిన ప్రియమణినే ఇప్పుడు ఎన్ఠీఆర్ కి తల్లిగా నటించబోతున్నారు అంట.

ఇది విని చాలా మంది షాక్ కి కూడా గురి అవుతున్నారు మరి. అయితే దేవర మూవీలో ఎన్టీఆర్ అమ్మ క్యారెక్టర్ లో ప్రియమణి అతని చిన్నప్పటి సమయంలో కనిపిస్తుంది. అంటే అప్పటికి ఎన్టీఆర్ ..ఎన్టీఆర్ లాగా ఉండడు.. ఏదో ఒక చిన్న పిల్లాడి లాగా ఉంటాడు కాబట్టి పర్లేదని సరిపెట్టుకోవచ్చు.

Previous articleOTT రిలీజ్ ట్రెండ్ ని మొదలుపెట్టిన మొదటి తెలుగు సినిమా..! ఈ సినిమా చూశారా..?
Next articleఇప్పటి వరకు చూడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి” అరుదైన ఫోటోలు..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.