Ads
చాలామంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. దూర ప్రాంతాలను చూసి రావాలని ప్లాన్ చేసుకుంటారు కూడా. నిజానికి ప్రయాణాలు ఇష్టపడని వాళ్ళు ఉండరు. కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని నచ్చిన చోటకి వెళ్లాలని అందరికీ ఉంటుంది. అయితే ఎక్కువ మంది దూర ప్రయాణాలు చేయడానికి రైలు మార్గాన్ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. రైలులో వెళ్లడం అంటే చాలా మందికి ఇష్టం కూడా.
ట్రాఫిక్ ఇబ్బందులు వంటివి ఉండవు ఎంతో కంఫర్ట్ గా జర్నీ చేయొచ్చు. దూర ప్రాంతాలకి ట్రైన్ లో వెళుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఒక్కొక్కసారి చాలా మంది ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ప్రయాణం మరింత సరదాగా ఉంటుంది. అందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సమయం కూడా తెలీదు. అయితే చాలామందికి ఈ ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం రాత్రి పూట ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కదా… అలాంటప్పుడు రైలు ఎక్కడానికి ఇబ్బందులు రావచ్చు కదా..? లోపల ప్రయాణికులు భద్రత కోసం తలుపు వేసుకుని ఉంటే మనం రైలు ఎలా ఎక్కుతాము. ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే ఉంటుంది. మీకు కూడా ఈ ప్రశ్న వచ్చిందా అయితే కచ్చితంగా దీని జవాబు చూడాల్సిందే.
Ads
రాత్రిపూట రైలు లోపల ఉండే ప్రయాణికులు కంఫర్ట్ గా నిద్రపోవడానికి భద్రత కోసం తలుపులు వేసుకు ఉంటుంటారు అటువంటప్పుడు బయట నుండి మనం రైలు ఎలా ఎక్కుతాము తలుపు మూసి ఉంటుంది కదా..? పైగా ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉంటారు. అటువంటప్పుడు మనం పిలిచినా ఎవరూ పలకరు. మరి రైలు తలుపు ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే… రైలు లో టికెట్ కలెక్టర్లు కూడా ఉంటారు. అయితే టికెట్ కలెక్టర్లకి ఎవరు ఏ స్టేషన్ లో ఎక్కుతున్నారు అనేది తెలుస్తుంది. ట్రైన్ లో పనిచేసే టీటీఈలకి ఏ స్టేషన్ లో ఎవరెక్కుతారు అనేది తెలిసి ఉంటుంది. ఈ సమాచారం అంతా కూడా చాలా చక్కగా క్లియర్ గా ఉంటుంది. ఏ ప్రయాణికుడు ఏ భోగి ఎక్కుతారు అనేది వాళ్ళకి తెలుసు. సో అర్ధరాత్రి టైంలో కూడా వాళ్ళు ఆ భోగిలో ఉంటారు. దీనితో ఈ ఇబ్బందే ఉండదు.