Ads
టాలీవుడ్ లో రీల్ లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీలు ఉంటాయో…రియల్ లైఫ్ లో అంతకు మించిన లవ్ స్టోరీలు ఉంటాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో, 2013లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన మూవీ ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో నాజర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ల గురించి ఒక పంచ్ డైలాగ్ వేస్తాడు. అప్పట్లో అది ఎవరికి పెద్దగా అర్థమయి ఉండకపోవచ్చు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని తిరిగి ఇన్ని రోజుల తర్వాత ఆ డైలాగ్ తెగ వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ డైలాగులో ఏముంది ?అది వైరల్ అవ్వడానికి వెనక కారణం ఏమిటి ?అనే విషయం తెలుసుకుందాం పదండి.. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమెరికాలో ఉన్న అల్లు అర్జున్ ,అమలాపాల్ ప్రేమ విషయం తెలిసి ఇక్కడ ఇండియాలో వాళ్లతో వీడియో కాల్ మాట్లాడడానికి ఇరుపక్షాల పేరెంట్స్ కూర్చుంటారు. ఈ సందర్భంగా ఈ కులాంతర , మతాంత్ర వివాహాలకు కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ నాజర్ వేసే డైలాగ్ ప్రస్తుతం ఫుల్ వైరల్ అయింది.
“మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు, కమ్మ వాళ్ళ అమ్మాయి కాపు కుర్రాడు చేసుకుంది…ఇక మా గుంటూరు జిల్లా కమ్మ వాళ్ళ అబ్బాయి అయితే ఏకంగా మరాఠీ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వాళ్లంతా హ్యాపీగానే ఉన్నారు కదా…”అన్న నాజర్ డైలాగ్ పై ప్రస్తుతం పలు రకాల మీమ్స్ చేసి నెట్ లో వైరల్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన డైలాగ్ ఇప్పుడు వైరల్ ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తున్నారా…
ఇంతకీ ఈ డైలాగ్ లో ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఒకసారి డైలాగ్ ని బాగా గమనించండి. పూరి జగన్నాథ్ ఈ డైలాగులు అల్లు అర్జున్ రామ్ చరణ్ ,మహేష్ బాబు ఒరిజినల్ లైఫ్ లవ్ స్టోరీని సింపుల్ గా చెప్పేశాడు. దీంతో పూరి మూడు ప్రేమ కథలు గురించి ఒక్క సింపుల్ లైన్ లో తేల్చి చెప్పేసాడు అని నటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.