ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? పదేళ్లలో 20 సినిమాల్లో చేసింది…ఒకటి మాత్రమే హిట్..!

Ads

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఎంత కష్టమో అక్కడ నిలదొక్కుకోవడం అంతే కష్టం. కాస్త అయినా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే మన ఖాతా లో మంచి హిట్ పడాల్సిందే. మరి హీరోయిన్ల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు…వాళ్లకి గ్లామర్ ,యాక్షన్ ,డాన్సింగ్ తో పాటుగా బోలెడంతల్లా లక్ కూడా కావాలి. అయితే కొంతమంది హీరోయిన్లు తమ కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక కెరియర్ ను అర్ధాంతరంగా ముగిస్తారు.

మీరు ఫోటోలో చూస్తున్న ఈ అమ్మాయి కూడా సేమ్ ఆ బాపతికే చెందుతుంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఆ అమ్మాయి పేరు పియా బాజ్‌పాయ్. ఉత్తరప్రదేశ్ లోని ఎతావా లో పుట్టి ఫైనల్గా ఢిల్లీలో సెటిలైంది. సినీ ఇండస్ట్రీపై ఎంతో మక్కువ కలిగిన ఈమె మొదట్లో సినిమాల్లోకి వెళ్తాను అంటే ఇంట్లో ఒప్పుకోలేదట. దీంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మెల్లిగా యాక్టర్ కావడం కోసం ప్రయత్నాలు చేసింది.

యాక్టర్ అవ్వడం కోసం ఆఖరికి ముంబైకి మకాం మార్చింది. ఫస్ట్ లో సీరియల్స్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టినా ..క్రమంగా అమితాబ్ ,ధోని లాంటి స్టార్స్ సరసన యాడ్స్ కూడా చేసింది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శిని తీసిన యాడ్ వల్ల పియా బాజ్‌పాయ్ కు మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత 2008లో ‘పోయ్ సొల్ల పోరమ్’ అనే ఒక తమిళ్ సీరియల్ మెయిన్ లీడ్ గా అవకాశం వచ్చింది. తర్వాత సంవత్సరంలోపే తెలుగులో నిన్ను కలిశాక అనే మూవీతో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

రంగం మూవీ లో నటించిన తర్వాత ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది…దాంతో ఆఫర్లు వచ్చినా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అలా 2008 నుంచి 2018 మధ్యకాలం అంటే సుమారు పది సంవత్సరాల పాటు తెలుగు ,తమిళ్ ,మలయాళం ,హిందీ ,ఇంగ్లీష్.. ఇలా భాషా భేదం లేకుండా 20 సినిమాలు చేసింది కానీ క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదిగో ఫైనల్ గా ఈ సంవత్సరం ఓటీటీలో విడుదలైన ఒక హిందీ చిత్రం లాస్ట్ లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. యాక్టర్ గా సక్సెస్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ పిక్స్ తో బాగా వైరల్ అవుతుంది ఈ బ్యూటీ.

Previous articleఅతను టీం లో ఉంటే వరల్డ్ కప్ మనదే…ఆ లక్కీ ప్లేయర్ ఎవరంటే..? కానీ ట్విస్ట్.?
Next articleసినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని..సినిమా తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.