Ads
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. రోడ్డు మీద వెళ్లే ఆటో దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి విభాగంలో మహిళలు రాణిస్తున్నారు. దీనికి భారత రైల్వే కూడా మినహాయింపు కాదు.. ఎందుకంటే దేశంలో 5 రైల్వే స్టేషన్స్ బాధ్యతలను ముఖ్యంగా మహిళలే నిర్వహిస్తున్నారు. షాకింగ్ గా ఉన్న ఇది నిజం.. మరి ఆ 5 రైల్వే స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి? అవి నడుపుతున్న ఐదుగురు వీరనారీమణులు ఎవరో తెలుసుకుందాం పదండి..
అజ్ని రైల్వేస్టేషన్ :
మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ లో నిర్మించిన అజ్ని రైల్వే స్టేషన్ లో అన్ని బాధ్యతలను మహిళలే నిర్వహిస్తున్నారు. మహిళల చేత నిర్వహించబడే స్టేషన్లో ఇది మూడవ స్థానంలో నిలుస్తుంది. సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే ఈ స్టేషన్ నుంచి రోజుకు కనీసం 6000 మంది ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తారు.
గాంధీనగర్ రైల్వేస్టేషన్ :
Ads
రాజస్థాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్ లో ఉన్న గాంధీనగర్ రైల్వే స్టేషన్ లో బాధ్యతలను నిర్వహించేది స్త్రీలే. ఇది మహిళలు నిర్వహించే మొట్టమొదటి రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.
చంద్రగిరి రైల్వేస్టేషన్ :
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ గుంతకల్లు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది వరకు పనిచేసే వారంతా మహిళలే కావడం విశేషం.
మణినగర్ రైల్వేస్టేషన్ :
గుజరాత్ అహ్మదాబాద్ లో నిర్మించిన ఈ మణినగర్ రైల్వే స్టేషన్ ను కూడా అందరూ మహిళలే నిర్వహిస్తారు.
మాతుంగా రైల్వేస్టేషన్ :
ముంబైలో సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే ఈ మాతుంగ రైల్వే స్టేషన్ లో ఉద్యోగులు అందరూ మహిళలే. 2018లో ఈ స్టేషన్కు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది.