ఇది కదా గెలుపు అంటే…1988లో ఫొటోకే “నో” చెప్పిన సీనియర్ యాక్టర్ కి..ఇప్పుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.!

Ads

రవితేజ…. సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ..అంచలంచలుగా మాస్ మహారాజ్ రేంజ్కు ఎదిగిన స్టార్ హీరో. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈ నటుడు ఎప్పుడు ఓవర్ నైట్ స్టార్ గా ఎదగలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో పాటు అవమానాలను కూడా దిగమింగి.. కేవలం కెరియర్ పై దృష్టి పెట్టడంతో ఈరోజు అతను ఈ స్థాయికి ఎదిగాడు.

ప్రస్తుతం మాస్ మహారాజ్ స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ తిరిగి విక్రమార్కుడు రేంజ్ హిట్ రవితేజ ఖాతాలో పడుతుంది అన్న భరోసాన్ని ఫాన్స్ లో కలిగిస్తోంది. నేపథ్యంలో ఈ చిత్రంలో నటిస్తున్న ఒక సీనియర్ నటుడు.. రవితేజకు పెద్దగా గుర్తింపు లేని రోజుల్లో ఫోటో అడిగితే రిజెక్ట్ చేశాడట.

Ads

ఆ విషయం ఇప్పుడు తెలుసుకుని ఈ సందర్భంగా రవితేజ కి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇది తెలిసిన రవితేజ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్. అనుపమ్ ఖేర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తనను రిజెక్ట్ చేసిన నటుడికి పిలిచి మరి సినిమాలో అవకాశం ఇచ్చిన పెద్ద మనసు రవితేజ ది అని అతని ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే…టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్ లో భాగంగా జరుగుతున్న ఇంటర్వ్యూలో అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. 1988లో అక్టోబర్ 9 వ తారీఖున ఒక చిన్న పిల్లాడి తో పాటు తన స్టూడియోకి వచ్చిన రవితేజ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోటో దిగుతాను అని అడిగాడట. అయితే షూటింగ్ ఫ్రస్టేషన్ లో ఉన్న అతను లేదు అని దురుసుగా చెప్పాడట. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుని అనుపమ్ ఖేర్ ప్రెస్ మీట్ లోనే రవితేజ కి సారీ చెప్పడం జరిగింది. అంత సీనియర్ నటుడు అయినప్పటికీ ఎటువంటి భేషజం లేకుండా జరిగిన తప్పుని పబ్లిక్ గా ఒప్పుకోవడం నిజంగా అతని గొప్పతనానికి సూచన.

Previous articleకోహ్లీ కంటే తోపు అన్నారు…కట్ చేస్తే వరల్డ్ నెం.1 బ్యాటర్ ఐదు మ్యాచుల్లో కేవలం 71 పరుగులే..!
Next articleఅప్పుడు రతిక… ఇప్పుడు ఈ కొత్త కంటెస్టెంట్..! రైతుబిడ్డ మళ్ళీ మొదలెట్టాడుగా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.