డబ్బులు లేక టీచర్ గా మారిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో పవన్ కళ్యాణ్, బాలయ్యలతో నటించి.?

Ads

సుస్వాగతం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి దేవయానీ .ఆమె తెలుగు, హిందీ ,తమిళ్ ,మలయాళం, కన్నడ.. భాషలలో పలు చిత్రాలలో నటించారు. తొలి సినిమా తోటే తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిన దేవయానీ ఆ తరువాత కెరియర్ లో కాస్త వెనుక పడ్డారు.

సీరియల్స్ లో మంచి సేమ్ తెచ్చుకున్న ఈ నటి రీసెంట్ గా ఎన్టీఆర్ కథానాయకుడు ,లవ్ స్టోరీ ,జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేశారు. అయితే ఇంత ఫేమ్ తెచ్చుకున్న దేవయానీ ప్రస్తుతం మిజరబుల్ లైఫ్ లీడ్ చేస్తోంది అని కొందరు గాసిప్ స్ప్రెడ్ చేస్తున్నారు.

సినిమాల్లో ఛాన్స్ లేకపోవడంతో జీవనోపాధికి ఈ నటి, ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నమ్మడానికి వింతగా ఉన్న ఈ విషయం కరెక్ట్ అని కొందరు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే త‌మిళ‌నాడులోని అన్నాసాలై లోని చ‌ర్చికాన్వెంట్ లో దేవయానీ నర్సరీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఇందుకుగాను ఆమె తీసుకునే జీతం పదివేల రూపాయలు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఇలా పదివేల కోసం స్కూల్ టీచర్ గా పని చేయడం ఏమిటి…. అంటే ఆమెకు ఆ జాబ్ ఇష్టం అనేది కొందరి వాదన.

Ads

సినిమాల్లోకి రావడానికి ముందు దేవయానీ10వ తరగతి వరకు చదువుకుంది. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు. దేవయానీ మాత్రం అప్పుడప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతుందట. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి.

ఉన్న కాస్త సేవింగ్స్ ని ప్రొడక్షన్ లో పెట్టి నష్టపోయింది దేవయానీ. కెరియర్ ఒడిదుడుకులు ఎదుర్కొనే సమయంలోనే టీచర్గా ఉద్యోగానికి కావలసిన అర్హత సంపాదించింది. ఇప్పుడు ఆ టీచర్ ఉద్యోగమే ఆమె కుటుంబ పోషణకి ఆధారమైంది అని కొందరు అంటుంటే…ఆమె టీచరుగా పనిచేసేది ఆత్మసంతృప్తి కోసం మాత్రమే కానీ ఆమె పరిస్థితి మరీ అంత దిగజారిపోలేదు అని కొందరు అంటున్నారు.

ఏది నమ్మాలో ,ఏది నమ్మకూడదు తెలియదు కానీ.. ఇండస్ట్రీలో కోట్లు సంపాదించి చివరి నిమిషంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడినవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవయానీ విషయంలో ఇది నిజమే అని చాలామంది భావిస్తున్నారు.

Previous article“మామా మశ్చీంద్ర” లో ట్రిపుల్ రోల్ తో “సుధీర్ బాబు” హిట్ కొట్టగలిగారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleఈ 5 రైల్వే స్టేషన్లలో అందరూ మహిళలే… మన “ఆంధ్ర ప్రదేశ్” లోనే ఎక్కడ అంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.