Ads
- చిత్రం : రూల్స్ రంజన్
- నటీనటులు : కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్, నేహా శెట్టి.
- నిర్మాత : దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
- దర్శకత్వం : రతినం కృష్ణ
- సంగీతం : అమ్రీష్
- విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023
స్టోరీ :
సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) . ఎంతో కష్టపడి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించి ముంబైలో జాబ్ కోసం వెళ్తాడు. మొదట్లో మనోరంజన్ కి హిందీ రాకపోయినా తర్వాత నేర్చుకొని అదే కంపెనీలో టీం లీడర్ అయ్యి అక్కడ రూల్స్ పెట్టడం మొదలు పెడతాడు. అందుకే తన కంపెనీలో అందరూ మనోరంజన్ ని రూల్స్ రంజన్ అని పిలుస్తారు.
తర్వాత ముంబైలో మనోరంజన్ తన క్లాస్ మేట్ అయిన సన (నేహా శెట్టి) ని కలుస్తాడు. కాలేజ్ లో ఉన్నప్పుడే సన అంటే ఇష్టం ఉన్నా కూడా చెప్పలేకపోయిన మనోరంజన్ ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తాడు. సన కూడా అతని ప్రేమని అంగీకరిస్తుంది. తర్వాత మళ్లీ సన దూరం అవ్వడంతో మనోరంజన్ తన కోసం వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది? సన ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది? ఈ పెళ్లిని మనోరంజన్ ఎలా ఆపాడు? దాని కోసం అతని స్నేహితులు అతనికి ఎలా సహాయ పడ్డారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమాని డైరెక్టర్ మొదటి నుంచి చివరి వరకు కామెడీ జోన్ లో నడిపించడానికి ట్రై చేసారు. రంజన్ గా నటించిన కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుంది. ఈ సినిమా లో వెన్నెల కిషోర్ ,సుదర్శన్, హైపర్ ఆదిల కామెడీ ట్రాక్ బాగుంది. అటు ఎమోషన్స్, ఇటు కామెడీ ని బాలన్స్ చేస్తూ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేసారు డైరెక్టర్. నేహా శెట్టి ఈ సినిమాకి ప్లస్.
Ads
సినిమా కథ విషయానికి వస్తే చాలా బలహీనంగా ఉంది. దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు? అసలు ఏం చెప్పాడు? ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు. సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది అసలు కన్ఫ్యూజన్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే, సినిమా ఎప్పుడు అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కామెడీ ట్రై చేశారు. ఒకటి రెండు చోట్ల తప్ప అది కూడా పెద్దగా పేలలేదు.
ఈ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ చాలా హిట్ అయ్యింది. సినిమాలో సాంగ్ విజువల్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మిగిలిన పాటలు అంతగా ఆకట్టులేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది…కానీ ఎడిటింగ్ అక్కడక్కడ ఇంకొంచెం షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాకి స్టోరీ మైనస్ పాయింట్ అయ్యింది. అలాగే కొన్ని సన్నివేశాలు డైరెక్టర్ సరిగా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారు. క్రింజ్ కామెడీ మీకు నచ్చితే సినిమా చూడచ్చు…లేదు రొటీన్ అనుకుంటే చూడకపోవడమే మంచిది.
ప్లస్ పాయింట్స్ :
- వెన్నెల కిశోర్ కామెడీ
- సమ్మోహనుడా సాంగ్ విజువల్స్
- నేహా శెట్టి గ్లామర్
మైనస్ పాయింట్స్:
- స్టోరీ లైన్
- ఎడిటింగ్
- బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
క్రింజ్ కామెడీ మీకు నచ్చితే సినిమా చూడచ్చు…లేదు రొటీన్ అనుకుంటే చూడకపోవడమే మంచిది.