Ads
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వడంతో..కప్ టీం ఇండియా ఖాతాలోకి రావాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ తరఫున రెండు మ్యాచ్‌లు పూర్తీ అయ్యాయి. ఇక అక్టోబర్ 8వ తారీఖున టీం ఇండియా ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.
ఇంతకుముందు 2011లో భారత్ స్వదేశంలోనే శ్రీలంకపై ఫైనల్ లో గెలిచి ట్రోఫీని సాధించింది. అప్పుడు కూడా టీమిండియా కెప్టెన్సీ ధోని చేతుల్లోనే ఉంది.2013లో ధోని కెప్టెన్ గా సారథ్యం వహిస్తున్నప్పుడు టీం ఇండియా ఛాంపియన్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే ఇక తర్వాత నుంచి ఇప్పటివరకు టీమిండియాను బ్యాడ్ లక్ ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది.
2013 తర్వాత ఎన్నోసార్లు ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ వరకు వెళ్ళింది కానీ టైటిల్ మాత్రం గెలవలేక పోతోంది టీం ఇండియా. 2014లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో కూడా ఫైనల్స్ వరకు వెళ్ళింది…2016 టీ 20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కే ఇంటికి తిరిగి వచ్చింది…2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో విఫలమయ్యింది…ఇక లాస్ట్ ఇయర్ జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా సెమీ ఫైనల్స్ తో సరిపెట్టుకుంది.
Ads
ఇక ప్రస్తుతం ఆడుతున్న భారత జట్టులో ఒక ప్లేయర్ పై అభిమానులు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అతను ఉంటే చాలు టీం టైటిల్ గెలవడం ఖాయం అని.. అతను చాలా లక్కీ అని భావిస్తున్నారు. ఆ ప్లేయర్ మరెవరో కాదు భారత్ ఓపెనర్ శుభమన్ గిల్. అతడు ఏ టీం లో ఉంటే ఆ టీం కచ్చితంగా ట్రోఫీ ని కైవసం చేసుకోవడం తో అతనికి లక్కీ ప్లేయర్ అన్న టైటిల్ ను క్రికెట్ అభిమానులు ఇచ్చేశారు.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది…ప్రస్తుతం గిల్ డెంగీ పాజిటివ్ అని తేలింది.. దీంతో అతను రేపు అక్టోబర్ 8వ తారీఖున జరిగే మొదటి మ్యాచ్ లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ. మరి ఈ నేపథ్యంలో గిల్ టీమ్‌లో లేకపోవడం టీం విజయం పై ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు అక్కడక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఈ సంవత్సరం వన్డేల లో ఐదు సెంచరీలు చేసి దూకుడుగా పెర్ఫార్మ్ చేస్తున్న ఈ భారత్ యువ సంచలనం త్వరగా కోలుకొని మ్యాచ్ లో ఆడాలి అని అందరూ ఆశిస్తున్నారు.