సడన్ గా సితారని హైలైట్ చేయడం వెనక “మహేష్ బాబు” ప్లాన్ ఇదేనా.? గతంలో కృష్ణ కూడా.?

Ads

ఘట్టమనేని సితార…ప్రస్తుతం సోషల్ మీడియా దగ్గర నుంచి జువెలరీ యాడ్స్ వరకు ఎక్కడ చూసినా వినిపించే పేరు. ఒకప్పుడు అసలు ఎవరో కూడా తెలియని ఈ సితార ప్రస్తుతం టాలీవుడ్ లేటెస్ట్ అప్ కమింగ్ యంగ్ సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువనే చెప్పవచ్చు. కరోనాకి ముందు వరకు సితార కేవలం మహేష్ బాబు కూతురుగా మాత్రమే అందరికీ పరిచయం.

తర్వాత మెల్లిగా ఇన్స్టాలో పలు రకాల వీడియోలు, డాన్స్ క్లిప్స్ పెడుతూ మహేష్ బాబు కూతురు బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఆమె చేసిన వీడియోలు కొన్ని అయినా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. ఇక గత కొద్ది కాలంగా మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా కూతుర్ని వెంట తీసుకువెళ్లడం ,ఈవెంట్స్ కి కూతురుతో వచ్చే అటెండ్ అవ్వడం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఎందుకు మహేష్ బాబు కూతుర్ని ఇంతగా హైలైట్ చేస్తున్నాడు అనే విషయం ప్రస్తుతం పెద్ద హార్ట్ డిస్కషన్ అయింది.

Ads

మహేష్ బాబు కొడుకు ఒక మూవీలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎందుకో మహేష్ బాబు కొడుకు బాగా సైలెంట్ అయిపోయాడు. మరోపక్క మహేష్ ఎంతో యాక్టివ్ గా ఉన్న సితారను త్వరలో ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు…అందుకే ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ కూడా ఇదే రకంగా మహేష్ బాబుని చిన్నప్పటినుంచి ఒక వెరైటీ స్ట్రాటజీతో బూస్ట్ చేశారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే పలు రకాల కార్యక్రమాలతో జనానికి పరిచయం చేశాడు. ఇప్పుడు తండ్రి స్టార్ట్ జీనే కొడుకు కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.

 

 

Previous articleటీం ఇండియాకు స్పాన్సర్ చేయడం ఈ కంపెనీలకు కలిసి రావట్లేదా.? అప్పుడు సహారా..ఇప్పుడు డ్రీం11.?
Next articleబ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ రిలీజ్ చేసిన మ‌ధుర పూడి గ్రామం అనే నేను థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.