“16 ఏళ్లకే నువ్వు దూరమవుతావు అని తెలిసి ఉంటే…అలా చేసి ఉండే దాన్ని”.. అంటూ కూతురు గురించి హీరో భార్య ఎమోషనల్ పోస్ట్.!

Ads

విజయ్ ఆంటోని కూతురు మీరా ఒత్తిడి కారణంగా ఆ-త్మ-హ-త్య చేసుకున్న సంఘటన ఆమె కుటుంబాన్ని కాక సమాజాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఆమె తల్లి ఫాతిమా కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతోంది.సెప్టెంబర్ 20న మీరా ఆమె రూమ్ లో ఉ-రి వేసుకుని సూ-సై-డ్ చేసుకుంది. కూతురు మరణంతో కుంగిపోయిన విజయ్ ….తన పాప తో పాటే తాను మరణించానంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

తాను ఇలా డిలా పడిపోతే తన కుటుంబం పరిస్థితి ఏమిటా అని…మెల్లిగా ధైర్యం కూడా తీసుకొని మళ్లీ తన పనుల్లో తాను లినమైపోయాడు విజయ్. అలాగే ఇకపై తాను చేసే ప్రతి సేవా కార్యక్రమం తన కూతురు మీరా పేరు మీదే జరుగుతుంది అని పేర్కొన్నారు. అయితే ఆమె తల్లి ఫాతిమా మాత్రం ఇంకా ఆ విషాదం నుంచి తెరుకోలేకపోతోంది. తాజాగా కూతుర్ని తలుచుకుంటూ ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ ట్వీట్ దీనికి నిదర్శనంగా నిలుస్తుంది.

Ads

ఈ ట్వీట్ చదివిన ఎవరికైనా బాధ కలగక మానదు. ప్రస్తుతం ఫాతిమా రాసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నిజానికి మీరా ఎటువంటి పని చేస్తుంది అని ఎవరు ఊహించలేదు.ఇది చదివిన నెటిజెన్స్ బాధపడకండి , ఆ దేవుడు మీకు ఈ భాదను భరించేశక్తిని ఇవ్వాలంటూ ఆమెను ఓదార్చుతున్నారు. ఇంతకీ ఫాతిమా రాసిన రాసిన ఏముందంటే…

vijay antony wife emotional post

పదహారేళ్లకే నువ్వు మాకు ఇలా దూరం అవుతావు అని తెలిసి ఉంటే…ప్రతిక్షణం నా దగ్గరే పెట్టుకుని ఉండే దాని…ఈ ప్రపంచానికి దూరంగా….కనీసం ఎండ నీడ కూడా నీ మీద పడకుండా చూసే దాన్ని..ఇప్పుడు నీవు వదిలి వెళ్లిన జ్ఞాపకాలతో, నీ ఆలోచనలతో ప్రతీక్షణం చస్తూ బతుకుతున్నాను..నువ్వు లేకుండా జీవించడం నా వల్ల కావట్లేదు…. నీ చెల్లి కూడా నీకోసం ఎదురుచూస్తోంది…మా కోసం ఒకసారి తిరిగి రా….అంటూ ఫాతిమా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ బాగా వైరల్ అయింది.

Previous articleటాలీవుడ్ కి దొరికిన మరొక కమెడియన్…ఇతను ఎవరో తెలుసా.?
Next articleఅప్పుడు అమృతం సీరియల్‌లో చూపించిందే… ఇప్పుడు హైదరాబాద్‌లో నిజం అయిందిగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.