Ads
2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ మూవీలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. ఒకే దగ్గర ఉద్యోగాలు చేస్తూ ఇరుగుపొరుగు ఉంటున్న ముగ్గురి ఫ్యామిలీస్ కు సంబంధించిన కథగా రూపొందించిన ఈ చిత్రం మధ్యతరగతి జీవితాలను బాగా హైలైట్ చేస్తుంది.
అవసరానికి మించిన ఖర్చులు పెడుతూ, అబద్ధాలు చెబుతూ బతికే భర్తలకు భార్యలు ఎలా బుద్ధి చెప్తారు అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో కామెడీ మేలవించి, సెంటిమెంట్ ను జోడించి తీసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ వైఫ్ గా రోజా నటించడం జరిగింది. ఆన్ స్క్రీన్ పై ఎంతో నేచురల్ గా కనిపించిన ఈ జోడి సెట్స్ లో సీన్స్ చేయడానికి తెగ తంటాలు పడ్డారట. ఏకంగా ఒక సీన్ చేయడానికి అయితే 27 టేకలు పట్టాయట. ఈ విషయాన్ని ఊరిలో వినాయకుడు షో కి గెస్ట్ గా వచ్చిన శ్రీకాంత్ ను హైపర్ ఆది అడగడంతో దానికి శ్రీకాంత్ ఇచ్చిన జవాబు చాలా వెరైటీగా ఉంది.
Ads
నిజానికి శ్రీకాంత్ రోజా కలిసి ఇంతకుముందే “సీతారత్నం గారి అబ్బాయి” సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో ఇద్దరూ అన్నా చెల్లెలుగా నటించారు. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో శ్రీకాంత్ చెల్లెలుగా చేసినప్పటి నుంచి రోజా శ్రీకాంత్ ను అన్నయ్య అని పిలుస్తుందట. ఇక సెట్స్ లో కూడా అలాగే పిలవడంతో శ్రీకాంత్ భలే ఇబ్బంది పడేవాడు అంట. మరి ముఖ్యంగా వంటింటిలో వెనుక నుంచి వచ్చే ఆమెను పట్టుకుని డైలాగ్ చెప్పేసి చేసేటప్పుడు.. అన్నయ్య ఎందుకు ఆలోచిస్తున్నారు అని అనేదట. అందుకే అన్ని టేక్స్ పట్టాయి అని శ్రీకాంత్ జోవిఅల్ గా సమాధానం ఇచ్చాడు.
watch video:
also watch: click here to watch video