Ads
పాక్ జట్టులో నెంబర్ వన్ ప్లేయర్ అని…. పరుగులతో స్కోర్ బోర్డ్ పరగటిస్తాడని గట్టి నమ్మకంతో నెత్తిన పెట్టుకున్న క్రికెటర్ కాస్త బ్యాటింగ్ మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 జైత్రయాత్ర కొనసాగిస్తున్న పాక్ నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండవ మ్యాచ్లో శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం పార్క్ టీం ను ఒక భయం వెంటాడుతుంది.
ఒక ప్లేయర్ విషయంలో పాక్ సంశయం లో ఉంది…అతను మరెవరో కాదు టీం కెప్టెన్.. నెంబర్ వన్ వన్డే పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రస్తుతం చెత్త ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో మెగా రన్స్ చేయాల్సిన ప్లేయర్…సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ స్కోర్స్ కి పరిమితం అవుతున్నాడు.
Ads
మొన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో 22 బంతులు ఎదుర్కొన్న బాబర్ 17 పరుగులు చేయగలిగాడు. నిన్నటికి నిన్ను శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే సాధించి వెలు తిరిగాడు. చివరిసారి అతను ఆసియా కప్ సందర్భంగా నేపాల్ పై జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. ఇక అప్పటినుంచి గోరంగా విఫలమవుతూనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో జరగబోయే మ్యాచ్ లలో బాబర్ బ్యాటింగ్ పై పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కింగ్ కోహ్లీని మించిన ఆటగాడంటూ బాబర్ గురించి భారీగానే బూస్టింగ్ ఇచ్చారు కానీ సీన్ కట్ చేస్తే విషయం డిఫరెంట్ గా ఉంది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం నుంచి అహ్మదాబాద్ కు పాక్ జట్టు పయణమైంది. ఈరోజు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగించుకున్న భారత్ కూడా అక్టోబర్ 14న జరగనున్న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఇక అక్టోబర్ 14 జరగనున్న దాయాదుల పోరు. కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.