Ads
బిగ్ బాస్ హౌస్ లో కామన్ మాన్ కేటగిరీ లో ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్…పల్లెటూరు నుంచి వచ్చాడు…పందెం కోడిలా గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అని అనుకుంటే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ నొప్పిస్తున్నాడు. మొన్నటి వరకు రతికా వెనక తిరిగింది చాలదు అన్నట్లు…ఇప్పుడు మళ్లీ ఫ్రెష్ గా మొదలు పెట్టాడు. రతికా బిగ్ బాస్ హౌస్ లో రేపిన కలకాలం చూసి రతిక కన్నా స్నేక్ బెటర్ అని సోషల్ మీడియా కోడై కూసింది.
ఎంట్రీ ఇవ్వడంతోటే రతికా అందానికి పడిపోయిన ప్రశాంత్ ,ఆమె వెనక తిరుగుతూ… పులిహోర కలుపుతూ.. ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. అసలు నువ్వు వెళ్ళింది ఎందుకు ,చేస్తుంది ఏమిటి అని అతనిపై పని రకాల విమర్శలు వెల్లువెత్తాయి.మరో పక్క రతికా తిప్పుకున్నన్ని రోజులు వెనక బాగా తిప్పుకొని పనైపోయాక ప్రశాంత్ ను కూరలో కరివేపాకు లాగా తీసి పక్కన పడేసింది.
Ads
నామినేషన్ అప్పుడు అతని తిట్టడమే కాకుండా ..ప్రశాంత్ వల్లే తన గేమ్స్ స్పాయిల్ అయింది అని కూడా అంది. అయితే రతికా ఎలిమినేషన్ తర్వాత ప్రశాంత్ లో మార్పు వస్తుంది అనుకున్న ప్రేక్షకులకు మళ్లీ నిరాశ ఎదురైంది.ఆదివారం ఎపిసోడ్ల్ లో బిగ్ బాస్ హౌస్ లోక్ ఎంట్రీ ఇచ్చిన సరికొత్త కంటెస్టెంట్స్ లో ఒకరైన హాట్ బ్యూటీ అశ్విని తో ప్రశాంత్ పులిహోర కలపడం స్టార్ట్ చేసాడు.
నామినేషన్స్ టైం లో గొడవ కారణంగా శోభా అరిచి గోల పెట్టడంతో….ఏడుపు అందుకున్న అశ్విని ను కెప్టెన్ హోదాలో ఓదార్చుతూ తెగ ఓవర్ యాక్షన్ చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె వెనకే తిరుగుతున్న ప్రశాంత్ వైఖరి తో విసుగు పుట్టిన బిగ్ బాస్ కూడా నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ కెప్టెన్ అన్న విషయం నేను మరిచిపోయాను అంటూ పంచ్ విసిరాడు.