ఏంటి ఈమె “మహేష్ ఖలేజా” లో నటించిందా.? హీరోయిన్ రేంజ్ ఆమెకి ఆ రోల్ ఇచ్చారా.?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖలేజా. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశపరిచినా కూడా ఇప్పటికీ ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటారు. ఇటీవల ఈ సినిమా విడుదల అయ్యి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాలో మహేష్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ, పాటలు, స్టైలింగ్, అందులోనూ ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన మాటలు, సినిమా ద్వారా అందిన మెసేజ్ అన్ని కూడా చాలా కొత్తగా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేలా చేశాయి.

dilavar singh wife in khaleja

దేవుడు ఎక్కడో కాదు మనలోనే ఉంటాడు అనే ఒక సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు కూడా మరొక హైలైట్ అయ్యాయి. సినిమాలో ప్రకాష్ రాజ్, సునీల్, రావు రమేష్, అలాగే షఫీ ముఖ్య పాత్రల్లో నటించారు. అనుష్క శెట్టి ఈ సినిమాలో మొదటి సారిగా మహేష్ బాబుతో కలిసి నటించారు. వీళ్లిద్దరి పెయిర్ కూడా చాలా కొత్తగా అనిపించింది.

dilavar singh wife in khaleja

సినిమా కంటెంట్ పరంగా కొత్తగా ఉన్నా కూడా టైం కానీ టైంలో రిలీజ్ అవ్వడం కారణంగా, ఆ సమయంలో రోబో సినిమా ఉండడం కారణంగా ఈ సినిమాకి ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా చాలా కొత్తగా ఉంటుంది. దిలావర్ సింగ్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. హీరో ఆ పాత్రని ఉద్దేశించి చెప్తూ, “జూనియర్ అభిషేక్ బచ్చన్ లాగా ఉన్నాడు” అని చెప్తాడు. నిజంగా అతను చూడడానికి జూనియర్ అభిషేక్ బచ్చన్ లాగానే ఉంటాడు.

dilavar singh wife in khaleja

అతని భార్యకి డబ్బులు ఇవ్వడానికి హీరో దిలావర్ సింగ్ ఇంటికి కూడా వెళ్తాడు. దిలావర్ సింగ్ భార్యగా కనిపించిన వ్యక్తి కూడా కేవలం ఆ ఒక్క సినిమాలోనే కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తారు. ఆ అమ్మాయి ఎవరు అని ఇప్పటికీ ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. ఆ అమ్మాయి పేరు దివ్య మేరీ సిరియాక్ అని సోషల్ మీడియాలో కొన్ని మీమ్ పేజెస్ ఒక మీమ్ అయితే షేర్ చేశారు.

dilavar singh wife in khaleja

కానీ అమ్మాయి గురించి వెతికితే ఎక్కడా కూడా ఈ సినిమాలో నటించినట్టు మాత్రం లేదు. కొంత మంది, “ఈ అమ్మాయి కాదు” అని అంటే, మరి కొంత మంది మాత్రం, “సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యింది కాబట్టి మారే అవకాశం ఉంది” అని అంటున్నారు. మరి కొంత మంది అయితే ఇద్దరూ ఒకటేనా అని షాక్ కూడా అవుతున్నారు. ఏదేమైనా ఈ అమ్మాయి మాత్రం ప్రస్తుతం మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Previous articleSeriligampally Leader Ravi Kumar Yadav: తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!
Next articleకోర్టులో హై డ్రామా… జడ్జ్ ఆగ్రహం..? ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.