మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ అక్కడ పెడుతున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదం తెలుసా?

Ads

ప్రతి ఇంటిలో కంపల్సరిగా కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండక తప్పదు. అలా వంటింటికి ఎంతో అవసరమైన వస్తువు ఫ్రిడ్జ్. అందుకే ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్రిజ్ ని వంటింట్లో పెట్టుకునే వసతి లేకో …ఊరికే లేచి ఏమి వెళ్తామనే ఉద్దేశంతోనూ తెలియదు కానీ మొత్తానికి ఫ్రిడ్జ్ ని బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు. అర్ధరాత్రి ఏ ఆకలో దాహము వేస్తే బెడ్ రూమ్ నుంచి కిచెన్కి ఏం వెళ్తాంలే అనుకునేవారు ఉన్నారు. మరి ఇలా పెట్టుకోవడం వల్ల ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిజ్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా …కొన్ని అరుదైన సందర్భాలలో పేలే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ బెడ్ రూమ్ లో ఉంటే సమస్య మరీ పెద్దది అయ్యి అవకాశం ఉంది . ప్రస్తుతం వస్తున్న కొత్త ఫ్రిజ్లు అయితే అంత క్లోజ్డ్ గా ఉంటాయి కానీ అదే మీది పాత ఫ్రిడ్జ్ అయితే వెనక కాయిల్స్ ఉంటాయి. మరి అవి శుభ్రంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.

Ads

ఫ్రిడ్జ్ ఉత్పత్తి చేసే టెంపరేచర్ కారణంగా మీ గదిలోని ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు వస్తుంది. అందుకే రిఫ్రిజిరేటర్ వంటి వస్తువులు బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో పెట్టాలి. ఇక ఫ్రిజ్ నుంచి వచ్చే శబ్దం కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఫ్రిజ్ నుంచి గ్యాస్ వంటివి లీక్ అయ్యే అవకాశం ఉంది…అలాంటివి జరిగినప్పుడు నిద్రలో ఉన్న మనకు తెలియకుండానే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫ్రిడ్జ్ ని మీ పడకగదిలో పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి.

Previous articleభారీ నష్టాలను మిగిల్చిన మిడ్ రేంజ్ హీరోల 10 ఆక్షన్ సినిమాలు ఇవే…లిస్ట్ లో “విజయ్ దేవరకొండ” సినిమా కూడా.!
Next articleSeriligampally Leader Ravi Kumar Yadav: తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.