Ads
అమాయకపు చూపులతో అందరినీ ఇట్టే నవ్వించే కమీడియన్ విజయ్ సాయి….. సినిమాల్లో అతను మనకు హీరోగా, హీరో ఫ్రెండ్ గా,ఒక కమెడియన్ గా రకరకాల భిన్న పాత్రల్లో కనిపించాడు. అయితే నిజ జీవితంలో అతను ఎన్నో కష్టాలు అనుభవించాడు. 2006లో వనిత రెడ్డిని పెళ్లి చేసుకున్న విజయసాయి కొంతకాలానికి విభేదాల కారణంగా విడిపోయాడు.
2015లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోగా.. 2017లో అతను అత్మ హత్య చేసుకున్నాడు. అంతేకాకుండా తన చావుకి వనితే కారణం అంటూ సూ-సై-డ్ కి ముందు సెల్ఫీ వీడియో కూడా తీశాడు అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే దీని గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న వనిత పూర్తి వివరాలు వెల్లడించింది. సాక్షి కథనం ప్రకారం, వాల్ పోస్టర్ మూవీ సమయం లో ప్రేమలో పడిన వనిత, విజయ్ సాయి..ఇంట్లో ఒప్పుకోకపోవడంతో శ్రీశైలం వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంట్లో ఎవరికీ పెళ్లయిన విషయం చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఒకానొక సమయంలో వనిత వాళ్ళ అమ్మ ఆమె మెడలో పసుపు తాడు చూసి రోడ్డుపైన తాళి తెంచి గోల చేసిందట.
Ads
అయితే ఆ తర్వాత ఇల్లు వదిలిపెట్టి విజయ్ దగ్గరికి వచ్చేసి …ఇద్దరు కలిసి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. “కానీ ఆ తర్వాతే అతని నిజస్వరూపం మెల్లగా బయటకు వచ్చింది. పెళ్లయి 13 రోజులు కూడా గడవకముందే కొట్టడం మొదలుపెట్టడమే కాకుండా నాకు వచ్చిన సినిమా ఛాన్సులు కూడా చేయకూడదని కండిషన్స్ పెట్టాడు. మెల్లిగా ఇంటి నుంచి డబ్బు తీసుకురామని హిం-సిం-చే-వా-డు. పెట్టే హిం-స-లు భరించలేక 2013లో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు వేశాను.”
“విడాకులు మంజూరు చేసిన కోర్ట్ మా పాపను వారంలో ఒకరోజు అతనికి చూపించాలి అని ఆదేశించడంతో వారంలో ఒకరోజు పాప తనతోనే ఉండేది . అతనికి నాతో పెళ్లి కాకముందే వేరొక అమ్మాయితో ఎ-ఫై-ర్ ఉండేది. ఆ విషయం తెలిపాక నాకు అతని ముఖం కూడా చూడాలనిపించలేదు కానీ తీరా చనిపోయిన తర్వాత అతని పట్టుకుని ఏడ్చేసాను. కానీ నా కూతురి కోసం ఇప్పుడిప్పుడే నా కెరియర్ ను తిరిగి ప్రారంభిస్తున్నాను” అని వనిత రెడ్డి తన గతం గురించి చెప్పుకొచ్చింది.